స్నేహితులకు రూ. 40 లక్షలు అప్పు ఇచ్చాడు.. తిరిగి ఇవ్వమని అడిగినందుకు దారుణంగా చంపేశారు..

ప్రతీకాత్మక చిత్రం

మధుసూదన్ రెడ్డిని హత్యచేసి.. జహీరాబాద్ సమీపంలోని ఓ పొలంలో పూడ్చిపెట్టారు. అనంతరం కిడ్నాప్ డ్రామాను మొదలుపెట్టారు. ఈ విషయాలేవీ కుటుంబ సభ్యులకు తెలియదు. మధుసూదన్‌ అదృశ్యం కావడంతో అతడి కుటుంబ సభ్యుల చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • Share this:
  అతడు స్నేహితుల కోసం ఏమైనా చేసే రకం. వారు కష్టాల్లో ఉన్నారని తెలిసి ముగ్గురు మిత్రులకు దాదాపు రూ.40 లక్షలు అప్పుగా ఇచ్చాడు. డబ్బులు తీసుకొని ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎప్పుడిస్తారని పదే పదే ఫోన్‌లు చేశాడు. అంతే స్నేహితుడు ఒత్తిడి చేయడంతో ఆ ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాలేదు. చంపేద్దామా.. అని వారిలో ఒకరు సలహా ఇచ్చారు. అంతే ఆ ప్లాన్‌నే అమలు చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న స్నేహితుడినే దారుణంగా చంపేశారు. సంగారెడ్డిలో ఈ దారుణం జరిగింది. హైదారబాద్‌ పాతబస్తీకి చెందిన వ్యాపారిని అతడి స్నేహితులే కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ పొలంలో పూడ్చి పెట్టారు.

  కర్మన్‌ఘాట్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి చార్మినార్‌లో వ్యాపారం చేస్తుంటారు. ఆయను సంజు, గిరీశ్, గాడ్జే అని ముగ్గురు మిత్రులు ఉన్నారు. తరచూ మధుసూదన్‌ వద్దకు వెళ్లేవారు. ఐతే వారు కష్టాల్లో ఉన్నారని తెలిసి అడిగిగ వెంటనే డబ్బులు ఇచ్చారు. మధుసూదన్ రెడ్డి వద్ద ఆ ముగ్గురూ రూ.40 లక్షల మేర అప్పుగా తీసుకున్నారు. ఐతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మధుసూదన్‌ పదే పదే ఒత్తిడి తెచ్చారు. నాకు డబ్బులు అవసరం ఉందని వారిని పదే పదే అడిగాడు. ఈ క్రమంలో స్నేహితుడికి డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. అతడిని హతమార్చాలని స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ఆగస్టు 19న మధుసూదన్‌రెడ్డిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. వారికి జగన్నాథ్‌ అనే కారు డ్రైవర్‌ సహకరించాడు. అతడిని సంగారెడ్డి సమీపంలోని ఓ దాబా వద్దకు తీసుకెళ్లారు. అనంతరం జగన్నాథ్‌తో పాటు అతడిని కారును అక్కడే వదిలేసి.. వేరే కారులో మధుసూదన్‌ రెడ్డిని తీసుకెళ్లారు.

  మహిళ మెడలో బూట్లు వేసి నగ్నంగా ఊరేగించారు.. అదే కారణమా..?

  మధుసూదన్ రెడ్డిని హత్యచేసి.. జహీరాబాద్ సమీపంలోని ఓ పొలంలో పూడ్చిపెట్టారు. అనంతరం కిడ్నాప్ డ్రామాను మొదలుపెట్టారు. ఈ విషయాలేవీ కుటుంబ సభ్యులకు తెలియదు. మధుసూదన్‌ అదృశ్యం కావడంతో అతడి కుటుంబ సభ్యుల చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసుల.. అతడి కోసం గాలించారు. కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు. తాను పనిచేసి ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ కారులో మధుసూదన్ రెడ్డి వెళ్లడంతో ఆ నెంబర్‌ ఆధారంగా జగన్నాథ్‌ను గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా..మధుసూదన్ రెడ్డి హత్య విషయం వెలుగులోకి వచ్చింది. జగన్నాథ్ చెప్పిన వివరాల ఆధారంగా పొలంలో పూడ్చిపెట్టిన మధుసూదన్‌ మృతదేహాన్ని బయటకు తీశారు.

  Vijayawada: అనుమానస్పద స్థితిలో మహిళా సీఏ మృతి.. అతడే కారణం

  మధుసూదన్‌ను హతమార్చిన అనంతరం ముగ్గురు నిందితులు ముంబై హైవే వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జహీరాబాద్ మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇప్పటికే నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మధుసూదన్ రెడ్డిని ఎలా చంపారు? ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే వివరాలను రేపు మీడియాకు వివరించనున్నారు పోలీసులు.

  భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసిన భర్త.. ఆ తర్వాత హైడ్రామా.!
  Published by:Shiva Kumar Addula
  First published: