• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • THREE ELEPHANTS KILLED AFTER BEING HIT BY IRON ORE LADEN TRUCK IN ODISHA SK

లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి...

లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి...

ప్రతీకాత్మక చిత్రం

రాత్రి పూట భారీ వాహనాలను అడవిలోకి అనుమతించకూడదని NH-20పై ఆందోళన చేశారు.

  • Share this:
    ఒడిశాలోని ఘాటాగావ్ అటవీ ప్రాంతంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. NH-20పై ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏనుగులు చనిపోయాయి. కియోంఝర్ జిల్లా బలిజోడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా వాటిపైకి లారీ దూసుకెళ్లింది. 16 ఏళ్ల ఆడ ఏనుగుతో పాటు ఏడాది వయసున్న గున్న ఏనుగు స్పాట్‌లోనే చనిపోయాయి. తీవ్ర గాయాల పాలైన మరో ఏనుగు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మూడు ఏనుగుల డెడ్‌బాడీలు పరీక్షల కోసం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనుగుల మృతికి కారణమైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి పూట భారీ వాహనాలను అడవిలోకి అనుమతించకూడదని NH-20పై ఆందోళన చేశారు.

    First published:

    అగ్ర కథనాలు