Tragedy: మనమరాలిని ఎత్తుకుని డాబాపైకి వెళ్లి బట్టలు ఆరేస్తుండగా ఊహించని ఘటన..

ఇందిరా, మహాలక్ష్మి, అవంతిక

మనిషిని మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకూ సంతోషంగా ఉన్న వారి జీవితాలను చావు ఒక్క క్షణంలో హరించేస్తుంది. ఆ కుటుంబంలో చీకటిని నింపి వెళ్లిపోతుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై శింగారపేటలో జరిగిన విషాద ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

  • Share this:
    చెన్నై: మనిషిని మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకూ సంతోషంగా ఉన్న వారి జీవితాలను చావు ఒక్క క్షణంలో హరించేస్తుంది. ఆ కుటుంబంలో చీకటిని నింపి వెళ్లిపోతుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై శింగారపేటలో జరిగిన విషాద ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. శింగారపేటలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇందిరా, పిచ్చుమణి దంపతులకు మహాలక్ష్మి అనే పాతికేళ్ల వయసున్న కూతురు ఉంది. ఆమెకు పెళ్లయింది. అవంతిక అనే మూడేళ్ల పాప కూడా ఉంది. వివాహం అయినప్పటికీ భర్త శివతో మనస్పర్థల కారణంగా మహాలక్ష్మి తన కూతురితో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. ఇలా ఉన్న ఈ కుటుంబంలో ఆదివారం ఊహించని ఘటన విషాదాన్ని నింపింది. డాబా మీద బట్టలు ఆరేసేందుకు ఇందిరా మనమరాలు అవంతికను ఎత్తుకుని పైకి వెళ్లింది. పాపను చంకనెత్తుకుని బట్టలు ఆరేస్తోంది. ఈ సమయంలో.. దండెం పక్కనే ఉన్న విద్యుత్ తీగల మీద తడిసిన బట్టలు పడటంతో మహాలక్ష్మి, ఆమె ఎత్తుకున్న అవంతికకు కరెంట్ షాక్‌ తగిలింది.

    కరెంట్ షాక్ వల్ల ఇందిరా బాధతో కేకలేయడంతో కూతురు మహాలక్ష్మి పైకి వచ్చి చూడగా కరెంట్ షాక్‌ వల్ల తన తల్లి, పాప బాధ పడుతుండటాన్ని చూసి షాకైంది. వారిని కాపాడాలని భావించి.. ఆ కంగారులో వారిని పక్కకు లాగేందుకు ప్రయత్నించి మహాలక్ష్మి కూడా కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో.. ముగ్గురూ కొంతసేపటికి స్పాట్‌లోనే చనిపోయారు. ఇంటి డాబాపై ముగ్గురూ విద్యుత్ తీగలు పట్టుకుని విగతజీవులుగా పడి ఉండటాన్ని పక్కింటి వారు గమనించి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. అయితే.. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. కరెంట్ షాక్ కారణంగా మూడు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

    ఇది కూడా చదవండి: Shocking Incident: ఇంత దారుణమా.. లవర్‌తో పెళ్లయిన మూడో రోజే.. మనిషనే వాడు ఎవడైనా ఇలా చేస్తాడా..

    ఇందిరా భర్త పిచ్చుమణి ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేడు. బయటకు వెళ్లి ఇంటికొచ్చేసరికి ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటంతో ఏమైందా అని చూసిన పిచ్చుమణి తన భార్య, కూతురు, మనమరాలి మృతదేహాలను చూసి కుప్పకూలిపోయాడు. గుండెలవిసేలా రోదించాడు. శింగారపేట పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి.. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక కుటుంబానికి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తడిసిన బట్టలు కరెంట్ తీగలపై పడటం, ఆ బట్టలను ఇందిరా ముట్టుకోవడం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
    Published by:Sambasiva Reddy
    First published: