Home /News /crime /

THREE CYBER CASES WERE REGISTERED IN TWO DAYS IN THE JOINT MAHABUBNAGAR DISTRICT SNR MBNR

Cyber ​​crimes : 48గంటల్లో 3సైబర్‌ చీటింగ్ కేసులు .. ఉమ్మడి పాలమూరు జిల్లాపై కేటుగాళ్ల కన్ను

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Cyber ​​crimes: ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని చాలా చోట్ల ప్రజలు ఆన్‌లైన్‌ మోసాలకు గురవుతున్నారు. సైబర్ మోసాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా ప్రజలకు అన్నీ రకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికి గుడ్డిలో ఆన్‌లైన్‌ గేమ్స్ పేరుతో మోసగాళ్ల ఉచ్చులో పడుతూనే ఉన్నారు. 48గంటల వ్యవధిలో జిల్లాలో మూడు ఆన్‌లైన్‌ మోసాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Wanaparthy, India
    (Syed Rafi, News18,Mahabubnagar)
    ఉమ్మడి పాలమూరు( Mahabubnagar)జిల్లా పరిధిలోని చాలా చోట్ల ప్రజలు ఆన్‌లైన్‌ మోసాలకు గురవుతున్నారు. సైబర్ మోసాల(Cyber ​​fraud)పై పోలీసులు(Police) ఉక్కుపాదం మోపుతున్నా ప్రజలకు అన్నీ రకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికి గుడ్డిలో ఆన్‌లైన్‌ గేమ్స్ పేరుతో (Online games)మోసగాళ్ల ఉచ్చులో పడుతూనే ఉన్నారు. 48గంటల వ్యవధిలో జిల్లాలో మూడు ఆన్‌లైన్‌ మోసాలు వెలుగులోకి వచ్చాయి. వనపర్తి(Wanaparthi)టౌన్‌కి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో గేమ్ ఆడి లక్ష పోగొట్టుకున్నాడు. మరో వ్యక్తి మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన వ్యక్తి ఎలక్ట్రిక్ వాహనాల డీలర్‌షిప్‌(Electric Vehicle Dealership)కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడ్డాడు.

    Crime news : ఫస్ట్ వైఫ్ చనిపోయింది..రెండో భార్య వెళ్లిపోయింది.. మూడో భార్యపై అనుమానంతో ఏం చేశాడో తెలుసా



    48గంటల్లో మూడు సైబర్‌ మోసాలు..
    సైబర్ మోసాలు, ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల కలిగే నష్టాల నుంచి ప్రజలు తప్పించుకోలేకపోతున్నారు. ఏదో తెలియని ఆసక్తి, ఆశ, తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు వస్తాయనే దురాశ, అవతలి వ్యక్తులు చెప్పే మాటలతోనే అడ్డంగా బుక్కైపోతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కేడిఆర్ నగర్ కాలనీకి చెందిన మహేష్ ఆన్‌లైన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెట్టింపు వస్తాయనే ప్రచారనికి ఆకర్షితుడై 2021 జూన్ నుంచి కొద్ది కొద్దిగా డబ్బులు జమ చేస్తూ వచ్చాడు. ఆన్‌లైన్‌ మనీ బిజినెస్‌ నిర్వాహకులు కూడా అతడి నమ్మకాన్ని వమ్ము చేయకుండ రెట్టింపు డబ్బులు వేస్తూ వచ్చారు. వెయ్యి, రెండు వేలు వేయగానే రెట్టింపు డబ్బు రావడంతో 60 వేలు ఒక్కసారిగా డిపాజిట్ చేశాడు. వాటికి రెట్టింపు డబ్బు కావాలంటే ఆన్‌లైన్‌లో గేమ్ ఆడి సంపాదించుకోవాలని నిర్వాహకులు చెప్పారు.


    17లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
    నిర్వాహకులు చెప్పినట్లుగా ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడుతూ సంవత్సరంలో సుమారు 3లక్షల47వేల 716 రూపాయలు చెల్లించాడు. ఈ మొత్తం డబ్బులకు ఏవి తిరిగి రాలేదు. ఆన్‌లైన్ గేమ్‌ పేరుతో తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న మహేష్ బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన ప్రతాప్ అనే మరో వ్యక్తి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు.

    నమ్మించి డబ్బులు గుంజిన సైబర్ చీటర్స్..
    టౌన్‌కి చెందిన ప్రతాప్ ట్రాక్టర్ డీలర్‌గా వ్యాపారం చేస్తున్నారు. మార్కెట్‌లో బాగా చలామణి అవుతున్న ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల డీలర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ డీలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు కింద 60వేలు చెల్లించాలని ఈనెల 8న మెయిల్ వచ్చింది. మెయిల్‌లో చూపించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్‌కి ప్రతాప్ 60 వేలు పంపించారు. డీలర్‌షిప్ ఇస్తున్నామని మీకే వచ్చిందంటూ డబ్బులు పంపించమని 9వ తేదీన చెప్పారు సైబర్ మోసగాళ్లు. మోసగాళ్లు చూసించిన విధంగా నాలుగు విడతలుగా 14.21 లక్షలు పంపించారు.

    Telangana : డీజే సౌండ్‌కి డ్యాన్స్ చేయడం కోసం ఫైటింగ్ .. పెళ్లి బరాత్‌లో కత్తులు దూసుకున్నబంధువులు



    కొంప ముంచిన అత్యాశ..
    పెద్ద మొత్తంలో డబ్బులు పంపించిన తర్వాత అవతలి వ్యక్తుల నుంచి రిప్లై రాకపోవడంతో బ్యాంకు వెళ్లి ఆరా తీశాడు బాధితుడు ప్రతాప్. బ్యాంక్ అధికారులు చెప్పిన విషయానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. తాను పంపిన డబ్బులు కంపెనీకి కాదని ఓ వ్యక్తి పర్సనల్ అకౌంట్‌కి అని తెలియడంతో సదరు కంపెనీకి ఫోన్ చేయడంతో ఎవరికి డీలర్‌షిప్ ఇవ్వలేదని తమకు ఎలాంటి నగదు చేరలేదని తేల్చి చెప్పారు. మోసపోయినట్లుగా నిర్ధారించుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: CYBER CRIME, Mahabubnagar, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు