వైసీపీ జెండా స్తంభానికి విద్యుత్ షాక్... ముగ్గురు చిన్నారులు మృతి

కోదండరామస్వామి ఆలయ ప్రధాన కూడలి వద్ద విద్యార్థులు వైసీపీ జెండా రాడ్‌ విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో రాడ్‌ను పట్టుకొని ఆడుకుంటున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

news18-telugu
Updated: August 14, 2019, 8:31 AM IST
వైసీపీ జెండా స్తంభానికి విద్యుత్ షాక్... ముగ్గురు చిన్నారులు మృతి
కరెంట్ షాక్‌తో ముగ్గురు చిన్నారులు మృతి
  • Share this:
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సంతమాగలూరు మండలం కొప్పరంలో విషాదం చోటుచేసుకుంది. కోదండరామస్వామి ఆలయ ప్రధాన కూడలి వద్ద విద్యార్థులు వైసీపీ జెండా రాడ్‌ విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో రాడ్‌ను పట్టుకొని ఆడుకుంటున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరణించిన వారు 5వ తరగతి విద్యార్దులు 1.షేక్ పఠాన్ గౌస్ (11), 2. షెక్ హసన్ బుడే (11), 3.పఠాన్ అమర్ (11) గా గుర్తించారు.

నమాజుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వైసీపీ జెండా రాడ్డును ముగ్గురు విద్యార్థులు పట్టుకొని అడుకుంటుండగా..ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు, కుటుంబసభ్యులు చెబుతున్నారు.  వైసీపీ జెండా రాడ్డు విద్యుత్ తీగలకు తగిలి షాక్ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

 

  

 
First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...