Bhopal: ముగ్గురు అన్నదమ్ములు.. భార్యలకు దూరమయ్యారు.. ఐదు లీటర్ల శానిటైజర్ క్యాన్ కొని...

ప్రతీకాత్మక చిత్రం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శానిటైజర్ తాగిన ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్‌లో లాక్‌డౌన్ విధించింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, ఇండోర్, భోపాల్‌లో లాక్‌డౌన్ విధించారు. దీంతో.. మద్యం దొరకకపోవడంతో మద్యానికి బానిసైన...

  • Share this:
    భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శానిటైజర్ తాగిన ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్‌లో లాక్‌డౌన్ విధించింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, ఇండోర్, భోపాల్‌లో లాక్‌డౌన్ విధించారు. దీంతో.. మద్యం దొరకకపోవడంతో మద్యానికి బానిసైన ఈ అన్నదమ్ములు శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కు చెందిన పర్వత్, బుహ్రా, రామ్ ప్రసాద్ అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు యువతులను వివాహం చేసుకున్నప్పటికీ వారికి దూరంగా ఉంటున్నారు.

    పర్వత్, బుహ్రా కూలి పని చేసుకుంటూ ఉండగా, రామ్ ప్రసాద్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ముగ్గురూ మద్యానికి బానిసయ్యారు. రోజూ పనికి వెళ్లి రావడం, రాత్రికి మందు తాగి పడిపోవడం ఈ అన్నదమ్ములకు నిత్యకృత్యంగా మారింది. ఇటీవల.. భోపాల్‌తో పాటు జబల్‌పూర్, ఇండోర్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో.. మద్యం షాపులు మూతబడ్డాయి. మద్యం కోసం ప్రయత్నించినప్పటికీ ఈ అన్నదమ్ములకు దొరకలేదు.

    దీంతో.. మద్యానికి బానిసైన వీళ్లు శానిటైజర్‌లో ఆల్కహాల్ ఉంటుందని తెలుసుకుని ఐదు లీటర్ల శానిటైజర్ క్యాన్‌ను కొనుగోలు చేశారు. రాత్రికి ఆ క్యాన్‌లో సగానికి పైగా తాగేశారు. అంత శానిటైజర్ తాగినప్పుడు కొంత ఇబ్బందిగా అనిపించినా ఉదయం మళ్లీ తాగారు. ఆ రోజు రాత్రి రాంప్రసాద్ జహంగిరాబాద్‌లోని తన ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. భోపాల్‌లోని ఎంపీ నగర్‌లో ఓ రూమ్‌లో ఉంటున్న మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు కూడా మరుసటి రోజు ఉదయానికి విగతజీవులుగా పడి ఉన్నారు. ఉలుకూపలుకూ లేని ఆ అన్నదమ్ములను చూసి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.

    పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. శానిటైజర్ తాగి చనిపోతున్న ఘటన ఒక్క మధ్యప్రదేశ్‌లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అడపాదడపా వెలుగుచూస్తున్నాయి. సరిగ్గా రెండు రోజుల క్రితం విజయవాడలో ఇద్దరు వ్యక్తులు వేరువేరు ప్రాంతాల్లో శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో లిక్కర్ కొనుగోలు చేసేందుకు సరిపడా డబ్బులు లేక శానిటైజర్ కొనుక్కుని తాగి కొందరు మద్యానికి బానిసైన మందుబాబులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: