ఓ బాలికను నమ్మించిన బాలుడు.. మాయమాటలు చెప్పి ఓ పాఠశాలకు తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనిదీ. పూర్తివివరాల్లోకి వెళితే.. హరియాణా రాష్ట్రం జింద్ జిల్లాలలోని ఓ గ్రామంలో 14 సంవత్సరాల బాలిక నివసిస్తోంది. బాలికకు స్థానికంగా ఉండే 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం బాలిక ఇంట్లో అమ్మమ్మ మాత్రమే ఉందని తెలుసుకున్నాడు. సదరు బాలుడు బాలిక వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పి ఓ పాఠశాలకు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అక్కడే కాపు కాస్తున్న ఆ బాలుడి ఇద్దరు స్నేహితులతో కలిసి బాలికను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. ఇంటికెళ్లిన బాలిక తనపై జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి ప్రధాన సూత్రధారి అయిన బాలుడిని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు బాలుర కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gang rape, Haryana