Home /News /crime /

Married Woman: ఈమె ఇంటి ముందు ఒక బైక్ ఆగింది.. ఆ తర్వాత ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోరు..

Married Woman: ఈమె ఇంటి ముందు ఒక బైక్ ఆగింది.. ఆ తర్వాత ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోరు..

పుష్ప యాదవ్ (ఫైల్ ఫొటో)

పుష్ప యాదవ్ (ఫైల్ ఫొటో)

ఆమె పేరు పుష్ప యాదవ్. భర్తతో కలిసి థాయ్‌లాండ్‌లో ఉండేది. ఆమె భర్త చనిపోవడంతో గోరక్‌పూర్ జిల్లా సిదౌపార్ గ్రామానికి వచ్చి తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటోంది.

    గోరక్‌పూర్: ఆమె పేరు పుష్ప యాదవ్. భర్తతో కలిసి థాయ్‌లాండ్‌లో ఉండేది. ఆమె భర్త చనిపోవడంతో గోరక్‌పూర్ జిల్లా సిదౌపార్ గ్రామానికి వచ్చి తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటోంది. ఇటీవల ఆమె నట్టింట్లో దారుణ హత్యకు గురైంది. కన్న కూతురి ముందే ఆమెను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాటు తుపాకులతో కాల్చి చంపేశారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పుష్పా యాదవ్ తన భర్త దయానంద్ యాదవ్ చనిపోయిన తర్వాత నలుగురు పిల్లలతో కలిసి సిదౌపార్ గ్రామానికి వచ్చి ఉంటోంది. కొన్నాళ్లు అద్దె ఇంట్లో ఉన్న పుష్ప ఇటీవల సొంతింటిని నిర్మించుకుని అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. అత్తింటి వారితో విభేదాలు ఉండటంతో భర్త కుటుంబంతో ఆమెకు అంతగా సన్నిహిత సంబంధాలు లేవు.

    గత సోమవారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై ఇంటి వద్దకు వచ్చి ఇంట్లోకి వెళ్లారు. అయితే.. ఇంట్లోకి వెళ్లే ముందు పెద్ద హైడ్రామానే నడిచింది. ఇంటి ముందు బైక్ ఆగి ఉండటం చూసి పుష్ప యాదవ్ ఎవరు నువ్వని సదరు వ్యక్తిని అడిగింది. ఆ వ్యక్తి ‘నన్ను గుర్తుపట్టలేదా’ అని బదులిచ్చాడు. మాస్క్‌ పెట్టుకోని ఉండటం వల్ల తానెవరో నీకు తెలియడం లేదని, గేటు తీయమని ఆమెను సదరు వ్యక్తి కోరాడు. ఆమె నమ్మి గేటు తీయగానే అరటితో పాటు కొన్ని పండ్లను ఆమెకిచ్చాడు. ఇంతలో పక్కనే నక్కి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వెంటనే పిస్టల్స్‌ను బయటకు తీసి పుష్పపై గేటు బయట నుంచి కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల మోతకు ఇంట్లో ఉన్న పుష్ప కూతురు ప్రీతి బయటకు వచ్చి చూసింది.

    ఆమెను చూసిన దుండగులు ముగ్గురూ వెంటనే అక్కడ నుంచి పారిపోయారు. పుష్ప వద్దకు ఆమె కూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది. పుష్ప తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆమె స్పాట్‌లోనే కుప్పకూలిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. పుష్ప పెద్ద కుమార్తె అంజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

    ఇది కూడా చదవండి: Viral: ఇదేదో రికార్డింగ్ డ్యాన్స్‌లో సీన్ కాదు.. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఉంది ఎవరో తెలిస్తే..

    ఆస్తి తగాదాల కారణంగానే ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పుష్ప కూతురు పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో పుష్ప భర్త సోదరుడు హరినాథ్, అతని మేనల్లుడు గోపాల్, పుష్ప బావమరిది రాజు యాదవ్‌తో పాటు ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ బైక్ నంబర్‌ను కనుగొనేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం పుష్ప భర్త దయానంద్ యాదవ్ గుండెపోటుతో మరణించాడు. భర్త చనిపోయిన తర్వాత సిదౌపార్ గ్రామంలో ఫ్యాన్సీ స్టోర్ నడుపుకుంటూ పిల్లలను పుష్ప చదివించుకుంటోంది. ఆమెకు 16 ఏళ్ల కూతురు అంజు, 14 ఏళ్ల కూతురు పూజా, 13 ఏళ్ల వయసున్న హృతిక్, 10 ఏళ్ల కూతురు ప్రీతి ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత కొన్నాళ్లు పిల్లలతో కలిసి పుష్ప బ్యాంకాక్‌లో ఉంది. కరోనా.. తదనంతర పరిస్థితుల కారణంగా గ్రామానికి వచ్చి పిల్లలను ఆ షాప్ మీద వచ్చిన డబ్బుతో పోషించుకుంటున్న పుష్ప హత్య ఆ నలుగురు బిడ్డలకు తల్లిని దూరం చేసింది. అత్తింటి వారే ఆస్తి తగాదాల నేపథ్యంలో పుష్పను చంపించారని ఊరు ఊరంతా కోడై కూస్తోంది. పోలీసులు ఈ కోణంలో విచారిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Brutally murder, Crime news, Married women, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు