ముగ్గురు అక్కాచెల్లెళ్లను దుస్తులు విప్పించి.. పోలీసుల అమానుషం..

పోలీస్ స్టేషన్‌లో ఆ ముగ్గురిని పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారు. పోలీసుల దాడితో ఆ అక్కాచెల్లెళ్లలో ఒకరైన గర్భిణి స్త్రీకి గర్భస్రావమైంది. వీరిపై దాడి చేసినవాళ్లలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం.

news18-telugu
Updated: September 19, 2019, 7:26 AM IST
ముగ్గురు అక్కాచెల్లెళ్లను దుస్తులు విప్పించి.. పోలీసుల అమానుషం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ కేసు విషయమై ముగ్గురు అక్కాచెల్లెళ్లలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ వారిని వివస్త్రలుగా చేసి చిత్రహింసలకు గురిచేశారు. ముగ్గురిలో ఒకరు గర్భిణీ అన్న కనికరం లేకుండా.. ఆమెపై కూడా తీవ్రంగా దాడి చేశారు. అసోంలోని గువాహటిలో ఈ దారుణం జరిగింది. అసోంలోని బుర్హా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంగల్‌దోయ్ ప్రాంతంలో ఆ అక్కాచెల్లెళ్లు నివసిస్తున్నారు. ఇటీవల వీరి సోదరుడు ఓ యువతితో కలిసి ఇంట్లో నుంచి
పారిపోయాడు. వీరిద్దరి మతాలు వేర్వేరు కావడంతో ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరన్న కారణంతో పారిపోయారు.దాంతో ఆ యువతి బంధువులు అతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం సోదరుడి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీస్ స్టేషన్‌లో ఆ ముగ్గురిని పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారు. పోలీసుల దాడితో ఆ అక్కాచెల్లెళ్లలో ఒకరైన గర్భిణి స్త్రీకి గర్భస్రావమైంది.

వీరిపై దాడి చేసినవాళ్లలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. బాధిత అక్కాచెల్లెళ్లలో ఒకరు తమపై దాడి విషయాన్ని స్థానిక ఎస్పీ దరంగ్ దృష్టికి తీసుకెళ్లారు.తనను, తన సోదరిలను, తన భర్తను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివస్త్రలుగా మార్చి విచక్షణారహితంగా కొట్టినట్టు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసి 8 రోజులు గడిచినా.. ఎలాంటి చర్యలు లేకపోవడంతో మంగళవారం వీరు మీడియా ముందుకు వచ్చారు. వీరికి పలువురు ప్రజాసంఘాలు మద్దతుగా నిలవడంతో పోలీసుల వైపు నుంచి చర్యలు మొదలయ్యాయి. ఘటనపై ఏడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కోరినట్టు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.సింఘా తెలిపారు.దాడికి పాల్పడిన ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.


First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>