Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీలో చోరి.. ప్లాన్ మాములుగా లేదు.. కానీ అదిరిపోయే ట్విస్ట్..

తిరుమల శ్రీవారి ఆలయం(ప్రతీకాత్మక చిత్రం)

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీలో రూ. 30 వేలు చోరి చేశారు ముగ్గురు వ్యక్తులు.

  • Share this:
    తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీలో చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 30 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చోటుచేసుకుంది. వివరాలు.. మంగళవారం శ్రీవారి ఆలయానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. ఎక్కువ నగదుతో హుండీ దగ్గరకు వస్తున్న వారిని గుర్తించారు. నిందితుల్లో ఒకరు హుండీలో కానుకలు వేస్తున్నట్టు నటించి ముందున్న భక్తులు వేసిన నగదును హుండీలో పడకముందే పట్టుకుని మరో నిందితుడికి అందజేశాడు. వారికి అక్కడే ఉన్న మరో వ్యక్తి సాయంగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సీసీటీవీ కెమెరాల ద్వారా విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆలయం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోని దిగిన సిబ్బంది మొత్తం ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.

    ఇందుకు సంబంధించి టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్ గోపినాథ్ జట్టీ మాట్లాడుతూ.. " ఆలయం పరిసరాలు దాటి వెళ్లకముందే మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. వారి వద్ద దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకన్నాం. అనంతరం వారిని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించాం" అని తెలిపారు.

    ఇక, శ్రీవారి ఆలయంలో చోరీ చేస్తూ దొరికిపోయిన ఈ ముగ్గురు నిందితులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: