బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి..

జూన్ 27న సాయంత్రం వాట్సాప్‌లో మార్ఫింగ్ చేసిన బాలిక ఫొటోలను పంపించారు. బాలిక పేరుతోనే ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను తెరిచారు. అందులో మార్ఫింగ్ ఫొటోలను పోస్టు చేశారు.

news18-telugu
Updated: July 15, 2020, 12:27 PM IST
బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొంతమంది యువకులు ఓ బాలిక ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేశారు. ఆ బాలిక పేరు మీదనే నకిలీ ఫేస్ బుక్ ఖాతాను క్రియేట్ చేశారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా డబ్బులిస్తేనే వాటిని తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో సదరు బాలిక తండ్రి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బాలిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలిక ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. ఈ క్రమంలోనే జూన్ 27న సాయంత్రం వాట్సాప్‌లో మార్ఫింగ్ చేసిన బాలిక ఫొటోలను పంపించారు. బాలిక పేరుతోనే ఫేస్‌బుక్ నకిలీ ఖాతాను తెరిచారు. అందులో మార్ఫింగ్ ఫొటోలను పోస్టు చేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే ఆ ఫొటోలను తొలగించేందుకు డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాలిక తండ్రి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 15, 2020, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading