హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral video : ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారం .. బయటపెట్టినందుకు ఏం జరిగిందో ఈ వీడియో చూడండి

Viral video : ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారం .. బయటపెట్టినందుకు ఏం జరిగిందో ఈ వీడియో చూడండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Viral video: తండ్రి అంటే బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ రక్షణ కల్పించేవాడు. కాని హర్యానాలో ఓ తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలపైనే తన కామవాంఛను తీర్చుకున్నాడు. నిజం బయటపెట్టినందుకు ఆ అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

తండ్రి అంటే బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ రక్షణ కల్పించేవాడు. కాని హర్యానా (Haryana)లో ఓ తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలపైనే తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఇంట్లో ఉంటున్న కూతురిపై ఇంతటి దారుణానికి పాల్పడుతూ వచ్చాడు. తండ్రి చేస్తున్న అఘాయిత్యాలను భరించలేకపోయిన కూతురు అమ్మ, నాయనమ్మ, బాబాయ్, పిన్ని, మామయ్యలతో చెప్పినప్పటికి వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇంట్లో ప్రతి రోజు తండ్రి రూపంలో నరకం చూపిస్తూ వచ్చాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి కిరాతకాన్ని బాధితురాలు పోలీసు(Police)లకు చెప్పడంతో అతడ్ని జైలు(Prison)కు పంపారు. ఇప్పటి వరకు విని వదిలేసిన కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆమెను బెదిరిస్తున్నారు. తండ్రిని జైలుకు పంపుతావా అంటూ చంపుతామని బెదిరించడంతో బాధితురాలు ఏకంగా తన సోషల్ మీడియా(Social media)ద్వారా తన గోడు వెళ్లబోసుకుంది.

కూతుళ్లపై తండ్రి అత్యాచారం..

హర్యానా పానిపట్‌లోని పారిశ్రామిక వాడలో ఉంటున్న ఓ మైనర్‌ బాలిక మనోవేదన ఇది. కన్నతండ్రి కామక్రీడలకు బలైపోయిన యువతి తనకు రక్షణ కల్పించమని సాక్షాత్తు సోషల్ మీడియా ద్వారా అధికారుల్ని లేఖ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటోంది. ఇంట్లో ఉంటున్న తన తండ్రే తనపై గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడని వాపోయింది బాధితురాలు. రాత్రి నిద్రపోతున్న సమయంలో తండ్రి తన దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని తల్లికి చెబితే ..పట్టించుకోలేదని..నాయనమ్మ, బంధువులకు చెప్పినా పెడ చెవిన పెట్టారని తెలిపింది. నలుగురు సంతానంలో తాను రెండో అమ్మాయినని మొదటి అమ్మాయి వివాహం చేసుకొని వెళ్లిపోయిన తర్వాత నుంచి తనను తండ్రి శారీరకంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో బాధితురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తన దగ్గరున్న ఆధారాలను చూపించడంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.


మమ్మల్ని కాపాడండి..

తండ్రి టార్చర్ పోయిందనుకుంటున్న బాధితురాలికి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. తండ్రినే జైలుకు పంపిన దుర్మార్గురాలివి ..పరువు తీశావంటూ అందరూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని ఎలాగైనా కాపాడమంటూ అందరిని వేడుకుంటోంది బాధితురాలు. తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన చిన్న కూతురు తన బాధ తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో ఆమె అక్క కూడా స్పందించింది. పదేళ్ల క్రితం తన తండ్రి చెల్లెలిని ఇప్పుడు వేధిస్తున్నట్లుగానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతడ్ని కఠినంగా శిక్షించాలని ..తన సోదరికి, తనకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసింది. తండ్రి పరువు కోసం అన్నీ భరించిన తాను చెల్లెలి జీవితం నాశనం కావడం ఇష్టం లేకే ఈవిధంగా లేఖ రాస్తున్నానని పేర్కొంది. యమభటుల్లా మారిన కుటుంబ సభ్యుల నుంచి రక్షించాలని వేడుకుంటున్న ఇద్దరు ఆడపిల్లల వీడియో, లేఖలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

First published:

Tags: Crime news, Haryana, Viral Video

ఉత్తమ కథలు