Jagapathi Babu: సినీనటుడు జగపతిబాబు సోదరుడికి బెదిరింపులు

ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి జగపతిబాబు సోదరుడు యుగేంద్రకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 8, 2020, 7:56 PM IST
Jagapathi Babu: సినీనటుడు జగపతిబాబు సోదరుడికి బెదిరింపులు
జగపతిబాబు (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రముఖ సినీనటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్రకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేట స్థల విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి 25 ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి... యుగేంద్రతో పాటు కుమారుడిని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ బెదిరింపుల వెనుక బంజారాహిల్స్‌కు చెందిన రాజిరెడ్డి ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై యుగేంద్ర పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు... దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published by: Kishore Akkaladevi
First published: October 8, 2020, 7:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading