Home /News /crime /

THIS WORLD IS VERY SELFISH NURSING STUDENT WROTE BEFORE SHE DIED SSR

20 Year Old Girl: అద్దె గదిలో ఒక్కతే ఉంటున్న ఈ అమ్మాయి ఇలా చేసిందేంటి.. పాపం ఆమె కుటుంబం..

ప్రియాంక (ఫైల్ ఫొటో)

ప్రియాంక (ఫైల్ ఫొటో)

రానురానూ కొందరు యువతలో బతుకుపై భయం పెరిగిపోతోంది. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి లేకుండా పోతోంది. చావుతో సాధించేది ఏమీ లేదని, బతికి సాధించాలని ఎందరి జీవితాలో స్పూర్తినిస్తున్నప్పటికీ పరిస్థితి మారడం లేదు.

ఇంకా చదవండి ...
  చురు: రానురానూ కొందరు యువతలో బతుకుపై భయం పెరిగిపోతోంది. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి లేకుండా పోతోంది. చావుతో సాధించేది ఏమీ లేదని, బతికి సాధించాలని ఎందరి జీవితాలో స్పూర్తినిస్తున్నప్పటికీ పరిస్థితి మారడం లేదు. తాజాగా.. రాజస్థాన్‌లో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. ఆమె సూసైడ్ నోట్‌లో తల్లిదండ్రులను ఉద్దేశించి రాసిన మాటలు కంటతడి పెట్టించాయి.

  ‘నేను ఈ సమాజం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఈ ప్రపంచం ఎంతో స్వార్థంతో నిండిపోయి ఉంది. ఎవరూ ఎదుటి వాళ్లను అర్థం చేసుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి నా తప్పులను క్షమిస్తూ వచ్చారు. ఈ ఒక్కసారికి నేను చేస్తున్న ఈ తప్పును క్షమించండి. తల్లిదండ్రుల్లా ఎవరూ ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించలేరు. ‘ఐ లవ్ యూ అమ్మా, నాన్నా అండ్ మై ఫ్యామిలీ’ అని సూసైడ్ నోట్‌లో ఆ యువతి రాసింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝుంజ్‌హును ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే యువతి చురులోని శాస్త్రి మార్కెట్ ప్రాంతంలోని ఓ గదిలో అద్దెకు ఉంటూ చురు పట్టణంలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది.

  గత ఆదివారం ఉదయం ప్రియాంక తన గదిలో నుంచి ఎంత పొద్దెక్కినా బయటకు రాలేదు. దీంతో.. ఇంటి యజమానికి అనుమానమొచ్చి చూసి రావాలని తన కొడుకును, కోడలిని ప్రియాంక ఉంటున్న గది వద్దకు పంపాడు. ఎన్నిసార్లు తలుపు కొడుతున్నా ప్రియాంక తలుపు తీయలేదు. లోపల గొళ్లెం పెట్టి ఉంది. దీంతో.. కిటికీలో నుంచి ఏం జరిగిందా అని చూస్తే.. ప్రియాంక ఉరికి వేలాడుతూ కనిపించింది. ఊహించని ఈ ఘటనతో భయపడిపోయిన ఇంటి యజమాని కొడుకు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని ప్రియాంక తల్లిదండ్రులకు, ఆమె చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు.

  ఇది కూడా చదవండి: ChaiWali Chachi: ఈ పెద్దావిడ 31 ఏళ్ల నుంచి తిండీతిప్పలు మానేసి టీ మాత్రమే తాగి బతుకుతోంది.. కారణం తెలిస్తే..

  కూతురి ఆత్మహత్య గురించి తెలిసిన వెంటనే.. ప్రియాంక తండ్రి ప్రేమ్, ఆమె మేనమామ సునీల్ దంగి, అన్నయ్య రాజేష్ చురులోని ఘటన జరిగిన ఇంటికి వెళ్లారు. కూతురి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘ఎందుకిలా చేశావు తల్లీ’ అంటూ గుండెలవిసేలా రోదించారు. ప్రియాంక తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. గత శనివారం బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రియాంక 63.84 శాతం మార్కులు సాధించింది. కూతురు పాస్ కావడంతో తాము ఎంతో సంతోషించామని ఆమె తండ్రి చెప్పాడు. ప్రియాంక తల్లిదండ్రులు ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడారు. అయితే.. ఆ సమయంలో ప్రియాంక ఎందుకో అంత సంతోషంగా కనిపించలేదని, ఒత్తిడిలో ఉన్నట్లు అనిపించి ఏమైందని అడగ్గా.. ఏం లేదని.. తినేసి పడుకుంటానని తల్లిదండ్రులకు ప్రియాంక చెప్పింది. తెల్లారేసరికి ఈ ఘోరం జరిగిపోయింది.

  ఇంటి యజమాని మాట్లాడుతూ.. ప్రియాంకతో శనివారం సాయంత్రం తమ కుటుంబం మాట్లాడిందని.. ఆ సమయంలో ఆమె ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించలేదని చెప్పాడు. టెన్షన్‌గా ఉన్నట్లు కూడా అనిపించలేదని, ఎప్పటిలానే మాట్లాడిందని తెలిపాడు. పోలీసులు ప్రియాంక ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. 20 ఏళ్ల తమ కూతురు ఇక లేదనే విషయాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Nursing, Rajasthan, Women suicide

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు