ఒంటరి మహిళలే ఈ టెకీ టార్గెట్‌.. మ్యాట్రి‘మనీ’ మోసాల్లో ఆరితేరిన ఘనుడు..

చేసిది సాఫ్ట్ వేర్ ఉద్యోగం. ఐదంకెల జీతం. ప్రవృత్తి మాత్రం మోసం చేయడం. ఒంటరి మహిళలు అతడి టార్గెట్. మ్యాట్రిమోని సైట్లే అతని అడ్డాలు. అక్కడే మహిళల వివరాలు సేకరించి వల విసురుతాడు. డబ్బులు గుంజుతాడు.. ఆపై....

news18
Updated: November 12, 2020, 12:16 PM IST
ఒంటరి మహిళలే ఈ టెకీ టార్గెట్‌.. మ్యాట్రి‘మనీ’ మోసాల్లో ఆరితేరిన ఘనుడు..
ప్రతీకాత్మకచిత్రం
  • News18
  • Last Updated: November 12, 2020, 12:16 PM IST
  • Share this:
అతనో టెకీ.. చేసేది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. చదివింది బీటెక్‌. ప్రవృత్తి మాత్రం మోసాలు. దీనికి అతను ఎంచుకున్న మార్గం మాత్రం వినూత్నం. పెళ్లయి.. ఏదో కారణంతో కాపురం విచ్ఛిన్నమై వేరుగా ఉంటున్న ఒంటరి మహిళలే టార్గెట్‌గా ఇతను వల పన్నుతాడు. ఆపై పర్సనల్‌గా కలిసి పరిచయం పెంచుకుంటాడు. వస్తూపోతూ మంచితనం కనబరుస్తాడు. ఆనక అయినకాడికి చేబదులు.. అప్పుల పేరిట వసూళ్లకు పాల్పడుతాడు. కొన్ని సార్లైతే వారి బలహీనతలను ఆసరా చేసుకుని శారీరక వాంఛలనూ తీర్చుకుంటాడు. అది చాలదన్నట్టు బ్లాక్‌మెయిలింగ్‌.. ఇలా ఈజీమనీ కోసం ఈ తరహా మోసాలను కొనసాగిస్తూ పాపం పండి విజయవాడ కృష్ణలంక పోలీసులకు దొరికిపోయాడు. చేసిన తప్పులను ఒప్పుకుని కటకటాలు లెక్కిస్తున్నాడు.

వివరాల్లోకెళ్తే.. జగ్గవరపు ప్రదీప్‌కుమార్‌ది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. బీటెక్‌ చదివాడు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాడు. 2017లో పెళ్లయింది. 2019లో విడాకులయ్యాయి. అప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో బాటు, కర్నాటక, కేరళలలోని మ్యాట్రిమోనిలలో తనకు అనుకూలమైన వధువు కోసమంటూ దరఖాస్తు చేశాడు. మ్యాట్రిమోనిలో సూటబుల్ సంబంధం దొరగ్గానే వారు పంపిన వివరాల ఆధారంగా ఫోన్లు చేస్తాడు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌,ఇన్ స్టా గ్రాంల ద్వారా ఫొటోలు, ఇతర వివరాలు సంపాదిస్తాడు. ఆ తర్వాత వారితో చనువుగా ఉండే ప్రయత్నం చేస్తాడు. పర్సనల్‌గా కలిసి మాట్లాడాలని, అభిరుచులు, ఆలోచనలు కలవాలంటూ ప్రపోజ్‌ చేస్తాడు.

khammam, sathupally, software employee, cheating, crime, khammam crime news, vijayawada, andhraprdesh, ap news, telangana news, matrimonies, single ladies, widows
నిందితుడు ప్రదీప్ కుమార్


సహజంగానే ఒకసారి దెబ్బతిన్న అనుభవంతో.. ఇదేదో బావుందన్న భావనతో వారు అంగీకారం తెలపగానే ఇంటికొచ్చేస్తాడు. డాబు దర్పం ప్రదర్శిస్తూ.. తన స్టేటస్‌ను చాటుకుంటాడు. ‘మీరు నాకు నచ్చారు. పెళ్లి చేసుకుందామంటూ’ ప్రపోజ్‌ చేస్తాడు. ఆపై సడెన్‌గా తనకు డబ్బు అవసరం పడిందని, సర్దుబాటు చేయాలని మొహమాటపెడతాడు. లక్షల్లో డబ్బు గుంజాక మళ్లీ కంటికి కనిపించకుండా పోతాడు.

ఇదే కొత్తకాదు.. : ఇలా ఇప్పటికే ఎందరో ఒంటరి మహిళలను మోసం చేసిన ప్రదీప్‌కుమార్‌ విజయవాడకు చెందిన ఓ ఒంటరి మహిళ నుంచి రూ.12.20 లక్షలు మోసగించాడు. రోజులు గడచినా కనిపించకుండా పోవడం.. ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి.

అంతా కార్లోనే.. : ప్రదీప్‌ తన కారులోనే సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని, మ్యాట్రిమోనిల ఆధారంగా ఒంటరి మహిళలనే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. ఇతని కారుకు కర్నాటక, కేరళకు సంబంధించిన రెండు నెంబరు ప్లేట్లు ఉండడం మోసాల తీవ్రతకు అద్దం పడుతోంది. ఫోన్‌ టవర్‌ ఆధారంగా హైదరాబాద్‌లోని మాదపూర్‌లో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై కాకినాడ టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లోనూ కేసు నమోదైనట్టు తేలింది. అసలే జీవితంలో దెబ్బతిని, తోడులేక ఒక ఆసరా కోసం ఎదురుచూస్తున్న ఒంటరి మహిళలను మోసం చేస్తున్న ప్రదీప్‌కుమార్‌లాంటి వాళ్ల పట్ల సమాజం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Published by: Srinivas Munigala
First published: November 12, 2020, 12:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading