హోమ్ /వార్తలు /క్రైమ్ /

ATM Frauds: వీళ్లు జగత్ కంత్రీలు.. ఏటీఎం డిపాజిట్​ మిషన్లకే బురిడీ...రూ.48లక్షలు హాంఫట్​

ATM Frauds: వీళ్లు జగత్ కంత్రీలు.. ఏటీఎం డిపాజిట్​ మిషన్లకే బురిడీ...రూ.48లక్షలు హాంఫట్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ATM Frauds : వీళ్లు జగత్ కంత్రీలు. మహానగరంలో మాయగాళ్లు. ఏటీఎం డిపాజిట్ మిషన్లకే బురిడీ కొట్టి లక్షల్లో డబ్బులు స్వాహా చేస్తున్నారు.

ఏటీఎం క్యాష్​ డిపాజిట్​ మిషన్లనే మోసం చేస్తూ రూ.లక్షలకు లక్షలు కాజేస్తున్న ముఠాల గుట్టు బయటపడింది. వీరు ఏటీఎం డిపాజిట్​ మిషన్లను ఎలా మభ్య పెడుతున్నారన్నది తెలుసుకొని పోలీసులే అవాక్కయ్యారు. ఇటీవల ఎస్​బీఐ ఏటీఎంల నుంచి డబ్బులు కాజేసిన కేసులో ఓ వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.4.5లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తులో.. జూన్ 15 నుంచి 18 మధ్య ఎస్​బీఐ ఏటీఎంల మోసాలపై మొత్తం 14 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ నేరంలో మొత్తం ఐదు గ్రూపులు ఉన్నట్టు తాము గుర్తించామని వెల్లడించారు.ఈ గ్రూపుల్లో ఉత్తరాది నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చెన్నైలోని ఎస్​బీఐ క్యాష్ డిపాజిట్ మిషన్​ (సీడీఎం)ల నుంచి డబ్బు దండుకున్నారని చెప్పారు. “ఇప్పటి వరకు ముఠా సభ్యులు రూ.45 లక్షల వరకు కాజేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ చేస్తున్నాం. హర్యానాకు చెందిన అమీర్ అర్ష్​ అనే వ్యక్తిని పట్టుకున్నాం. ఇందుకోసం హర్యానా పోలీసుల సహకారం తీసుకున్నాం’ అని వివరించారు. ఈ కేసును చెన్నై పోలీసుల ప్రత్యేక బృందం విచారిస్తోంది.

* ఎలా మోసం చేశారంటే…

సాధారణంగా క్యాష్ డిపాజిట్​ మిషన్​ (సీడీఎం) నుంచి డబ్బు డ్రా చేసుకుంటే.. బయటికి వచ్చిన నోట్లను తీసుకునేందుకు మిషన్​ 20 సెకన్ల సమయం ఇస్తుంది. అప్పటిలోగా డబ్బు తీసుకోకుంటే మళ్లీ వెనక్కి తీసుకుంటుంది. మూత మూసుకుపోతుంది. ఈ కాస్త సమయాన్ని నిందితులు అదునుగా తీసుకున్నారు. ముందుగా సీడీఎంలో విత్​డ్రా ఆప్షన్​ను వినియోగించుకొని డబ్బులు విత్​డ్రా చేసుకునే వారు. అయితే డబ్బు తీసుకొని.. మూతమూసుకుపోకుండా చేయి అడ్డం పెట్టేవారు. 20 సెకన్లు ముగిశాక వదిలేసేవారు. అయితే సమయం ముగిసిపోవడంతో డబ్బు ఎవరూ తీసుకోలేదని సెన్సార్ల ద్వారా మిషన్​ అనుకునేది. దీంతో కార్డు నుంచి డబ్బు విత్​డ్రా చేసుకున్నా.. అకౌంట్​లో డబ్బు కట్​ అయ్యేది కాదు. లేదా మళ్లీ రీఫండ్ అయ్యేది. ఇలా విత్​డ్రా మిషన్లలోని సాంకేతిక లోపాన్ని వినియోగించుకొని ఈ ముఠాలు ఏకంగా రూ.48లక్షలు కాజేసినట్లు చెన్నై పోలీసులు వెల్లడించారు.


కాగా పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తాము ఎలా ఏటీఎం డిపాజిట్ మిషన్ల నుంచి డబ్బు కాజేసింది పూర్తిగా వివరించాడు. “చెన్నై నగరంలో మొత్తం ఐదు గ్రూపులు ఈ నేరానికి పాల్పడుతున్నాయి. ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.4.5లక్షలు స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం ఫరీదాబాద్​ వెళుతోంది” అని స్పెషల్ టీమ్​ పోలీసులు వెల్లడించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Atm withdrawal, Crime news, Sbi, Tamil nadu

ఉత్తమ కథలు