Royal Enfield బైక్ లు ఎత్తుకుపోతున్న ముఠాను ఒంటిచేత్తో పట్టుకున్న తమిళ సింగం

తమిళ్, తెలుగు లో సూపర్ స్టార్ హీరో సూర్య పోలీస్ పాత్రలో ఇరగదీసిన సింగం సినిమా చూశారా..? ఆ సినిమాలో పోలీసులు పరిష్కరించలేని ఎన్నో కేసులను అతడు సాల్వ్ చేస్తాడు. కానీ అది సినిమా. రియల్ లైఫ్ లోనూ ఒక పోలీసు అలాంటి సాహసాలే చేశాడు. అయితే ఆ పోలీసు ఉన్నతస్థాయి అధికారి కాదండోయ్.. సాధారణ హెడ్ కానిస్టేబుల్..

news18
Updated: October 20, 2020, 10:42 AM IST
Royal Enfield బైక్ లు ఎత్తుకుపోతున్న ముఠాను ఒంటిచేత్తో పట్టుకున్న తమిళ సింగం
image (Twitter)
  • News18
  • Last Updated: October 20, 2020, 10:42 AM IST
  • Share this:
తమిళనాడుకు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ రాష్ట్రంలో కొంతకాలంగా సంచలనం రేపుతున్న బైకుల ముఠా గుట్టును రట్టు చేశాడు. ఒంటిచేత్తో దొంగలను పట్టుకున్నాడు. ప్రాణాలకు తెగించి.. ఆ ముఠా గుట్టును తేల్చాడు. మూడేళ్లుగా సాగుతున్న దొంగతనాలకు చరమగీతం పాడాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఎత్తుకుపోయి.. దొంగచాటుగా అమ్ముతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ గ్రూపులో ఉన్న పది మంది దొంగలను అరెస్టు చేసి డిపార్ట్మెంట్ నుంచే గాక ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకీ ఎవరా కానిస్టేబుల్.. ఏంటాయన కథ.. తెలుసుకుందాం రండి..

మూడేళ్లుగా అంతుచిక్కని ముఠా: 

మూడేళ్ల నుంచి చెన్నైలో ఒక ముఠా royal enfield బైకులను దొంగతనం చేస్తున్నది. ఆ ముఠా ఇప్పటివరకూ అధికారికంగానే 26 బైకులను దొంగిలించింది. పోలీసులు ఎంత వెతికినా ప్రయోజనం లేదు. ఖాకీలను బురిడి కొట్టిస్తూ.. ఆ దొంగ బైకులను ఎత్తుకెళ్లుతూనే ఉంది. ఒక సమయంలో చెన్నైలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కొనాలంటే అదెంతకాలం వారి దగ్గర ఉంటుందో..? లేక ఆ ముఠా ఎత్తుకుపోతారో అనే భయం జనాలకు పట్టుకుంది. దొంగలు తెలివిగా సీసీటీవీలు లేని ప్రాంతాల్లో పార్కు చేసిన ఎన్ఫీల్డ్ బైకులను దొంగతనం చేసేవారు.

సీన్ లోకి ఎంట్రీ అయిన సూపర్ కాప్:

దే క్రమంలో అభిరామపురంలో పనిచేస్తున్నపుడు అక్కడే పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శరవణన్ కు ఒక ఫోన్ వచ్చింది. బైకు పోయిందని ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. ఈ కేసు గురించి ఆయన ఇతర పోలీస్ స్టేషన్లలో ఎంక్వైరీ చేశాడు. ఎక్కడ విన్నా.. ఒకటే కంప్లెయింట్.. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల చోరీ. అంతే.. ఈ ముఠాను ఎలాగైనా చేధించాలనుకున్నాడు శరవణన్. అనుకున్నదే తడువుగా వారిపై మాటు వేశాడు.

దొంగిలించబడిన బండ్లన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ లే. సీసీ టీవీలు లేని ప్రాంతాల్లో దొంగతనం జరుగుతున్నది. ఇతరత్రా విషయాలన్నీ గమనించిన శరవణన్.. సిటీలో ఇతర ప్రాంతాల్లో తప్పిపోయిన బండ్లు ఎక్కడైనా తిరుగుతున్నాయా అని చూశాడు. దాదాపు రెండు నెలల పాటు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్టు 6న ఈ ముఠా కు సంబంధించిన ఒక నిందితుడిని ట్రాక్ చేశాడు.
నిందితుడు చెన్నైలోని ఒక ఏరియాలోకి ప్రవేశించే సమయంలోనే శరవణన్ కూడా టీంతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అయితే ఇది గమనించిన ఆ దొంగ.. వారిని కన్ఫ్యూజ్ చేయడానికి ఎత్తులు వేశాడు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నట్టు బైకును తరలించి పోలీసులను దారి మళ్లించాలనుకున్నాడు.

పట్టు వదలని విక్రమార్కుడిలా.. 

అందరూ పోలీసులు అలాగే దారి మళ్లినా.. శరవణన్ మాత్రం స్పాట్ లోనే ఉంటూ ఆ దొంగ కదలికలను నెమ్మదిగా వాచ్ చేశాడు. 15 రోజుల పాటు సాగిన ఆ వేటలో.. చివరికి శరవణన్ కు వారిని పట్టుకునే టైం వచ్చింది. ఈ ముఠాలోని పలువురు దొంగలను అప్పటికే ట్రాక్ చేసిన శరవణన్.. వారి ఫోన్ నంబర్లను ట్రాక్ చేశాడు. రెండు లక్షల నంబర్లను ట్రాక్ చేసి అందులో.. దొంగలకు సంబంధించిన 19 నంబర్లను నిరంతరం ట్రాక్ చేశారు. కానీ ఆ దొంగలు ఫేక్ ఐడీలు పెట్టి ఫోన్లు వాడుతున్నారని తెలిసింది. చివరికి పలు దర్యాప్తుల తర్వాత ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల బృందం.. మిగతా వారి ఆట కట్టించింది. ఈ ముఠా రూ. 3 లక్షల లోపు విలువ చేసే రాయల్ ఎన్పీల్డ్ బైకులను రూ. 30 వేలు, రూ. 40 వేలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. బైకులను అమ్మడానికి, దొంగతనానికి సంబంధించిన వ్యవహారాల కోసం వీరికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది.

శరవణన్ కు గుర్తింపు..
కాగా, శరవణన్ కష్టం వృథా పోలేదు. అతని సీనియర్లు, కొలిగ్స్ తో పాటు చెన్నై ఈస్ట్ డివిజన్ జాయింట్ కమిషనర్ ఆర్. సుధాకర్ ఆయన ప్రతిభను గుర్తించాడు. శరవణన్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందనలు తెలిపారు. అంతేగాక అతడికి ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని కూడా అందజేశారు.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading