పెండ్లికాని యువతులను పూజలో కూర్చోబెడితే డబ్బుల వర్షం కురుస్తుందట.. ఇదో కొత్త తరహా మోసం..

ప్రతీకాత్మక చిత్రం

గతంలో బాలికలను బలి ఇవ్వడం, గుప్త నిధులు ఉన్నాయని మనుషులు లను బలి ఇవ్వడం ఇలా రకరకాల క్షుద్ర పూజలు చేసిన వారున్నారు. కానీ నోట్ల కట్టల (డబ్బుల) వర్షం చూపిస్తామంటూ బయల్దేరింది ఒక ముఠా.. అయితే అందులో పెళ్లి కాని యువతులే కూర్చోవాలట..

 • News18
 • Last Updated :
 • Share this:
  ఒకవైపు ప్రపంచం రాకెట్ సైన్స్ అంటూ విశ్వాంతరాల పై భవనాలు నిర్మించుకోవాలని చూస్తుంటే.. మనదేశంలో మాత్రం మూఢ నమ్మకాలు మాత్రం పెచ్చుమీరిపోతున్నాయి. క్షుద్రపూజల పేరిట గ్రామాల్లో ఇప్పటికీ అకృత్యాలు, హత్యలు, మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మనం ఇప్పటికే చాలా రకాల క్షుద్రపూజలు చూసి ఉంటాము. కానీ ఈతరహా క్షుద్రపూజలు బహుశా ఇదే ప్రథమమేమో...! గతంలో బాలికలను బలి ఇవ్వడం, గుప్త నిధులు ఉన్నాయని మనుషులు లను బలి ఇవ్వడం ఇలా రకరకాల క్షుద్ర పూజలు చేసిన వారున్నారు. కానీ నోట్ల కట్టల (డబ్బుల) వర్షం చూపిస్తామంటూ బయల్దేరింది ఒక ముఠా..

  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిక్కడ ఉన్నాయి. పెద్దపెల్లి జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన. నోట్ల వర్షం కురిపిస్తామంటూ దంపతులకు మాయ మాటలు చెప్పి మహిళతో పూజ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు దుండగులు. సదరు మహిళ వివాహిత కావడంతో.. ఆమె ఇందుకు పనికిరాదని, క్షుద్ర పూజకు కన్య అవసరమని ఎవరైన వివాహం కాని యువతి కావాలని వారికి డబ్బుల ఆశ చూపించారు.  కానీ వారి ప్రణాళిక బెడిసి కొట్టి పోలీసులకు చిక్కారు. అసలేం జరిగిందంటే...

  పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లిలో నలుగురు వ్యక్తులు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పెండ్లి కాని యువతులను పూజలో కూర్చోబెడితే డబ్బుల వర్షం కురుస్తుందని మహారాష్ట్రకు చెందిన బాబాతో కలిసి క్షుద్రపూజల కు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో చందపల్లికి చెందిన ఆర్కుటి సరిత, రాజయ్య లకు మాయ మాటలు చెప్పారు. వారికి రూ. 20 లక్షల ఇస్తామని చెప్పి వారి కూతురితో పూజ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ సదరు ముఠా చెప్పిన విదంగా వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల రంగ ప్రవేశంతో అసలు విషయం బయటికి వచ్చింది.

  అమాయకుల దగ్గర డబ్బులు కాజేసేందుకు ఈ ముఠా బారీష్ (వర్షం) క్షుద్రపూజ పేరిట అభూతకల్పన కల్పించి మోసగించాలని ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు కారకులైన ఆరెపల్లి రాజేందర్, బండ తిరుపతి, మంథన శ్రీనివాస్, కుమార్ లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్షుద్ర పూజల పేరిట ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే.. వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
  Published by:Srinivas Munigala
  First published: