మూడోతరగతి విద్యార్థిది హత్యే... వీడిన మిస్టరీ

ఏడో తరగతి చదువుతున్న ఆదిత్య సోదరుడు అశోక్‌ కూడా అదే హాస్టల్‌లో ఉంటున్నాడు. రాత్రి ఒంటిగంట సమయంలో టెన్త్ విద్యార్థి ఆదిత్యను మేడపైకి తీసుకెళ్లాడు. అక్కడ పెన్సిల్ చెక్కే బ్లేడ్‌తో గొంతుకోశాడు.

news18-telugu
Updated: August 7, 2019, 8:11 AM IST
మూడోతరగతి విద్యార్థిది హత్యే... వీడిన మిస్టరీ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 7, 2019, 8:11 AM IST
కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్‌లోకలకలం రేపిన మూడోతరగతి విద్యార్థి ఆదిత్య హత్యకేసును పోలీసులు చేధించారు. ఎనిమిదేళ్ల ఆదిత్యను తన మాట వినడం లేదని టెన్త్ క్లాస్ విద్యార్థి హత్య చేసినట్లు తేల్చారు. సోమవారం రాత్రి ఆదిత్యను బాత్ రూంకు తోడు రమ్మని తీసుకెళ్లిన పదోతరగతి విద్యార్థి... ఆదిత్య గొంతును పెన్సిల్ చెక్కే బ్లేడ్‌తో కోసినట్లు గుర్తించారు. సోమవారం వీరిద్దరు ఘర్షణకు దిగగా హాస్టల్ వాచమ్యన్ ఇద్దరి మందలించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అర్థరాత్రి టెన్త్ విద్యార్థి ఆదిత్యను పైకి తీసుకెళ్లడంతో అతనిపై అనుమానం మరింత బలపడింది. ఆ విద్యార్థిని పిలిచి గట్టిగా అడగడంతో అతడే హత్య చేసినట్లు అంగీకరించాడు.హత్య చేసిన వెంటనే తన బట్టలపై రక్తం పడటంతో వాటిని సూట్‌కేసులో దాచి... బట్టలు మార్చుకొని పడుకున్నాడు.

మంగళవారం ఆదిత్యను బాత్‌రూం వద్ద విగతజీవిగా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన హాస్టల్ సిబ్బంది వెంటనే బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించాలనుకున్నప్పటికీ ... అప్పటికే ఆదిత్య మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే ఈ వ్యవహారంలో అలసత్వం వహించిన హాస్టల్ వాచ్ మ్యాన్ నాగరాజుతో పాటు, హాస్టల్ ఇంఛార్జ్ రామరాజును కలెక్టర్ సస్పెండ్ చేశారు.  మృతిచెందిన విద్యార్థి ఆదిత్యకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు, అన్నయ్య ఉన్నారు. ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్‌లో ఆదిత్య తన అన్న అశోక్ ఉంటున్నారు.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...