Home /News /crime /

THIEVES WILL STOLE THINGS WHILE CONFUSING TARGET PRV

Thieves: ఈ దొంగల రూటే సపరేటు.. కన్​ప్యూజ్​ చేసి దోచేస్తారు.. చివరికి ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొందరు దొంగలు ఓ బస్సులో ఏకంగా రూ.46 లక్షలు విలువజేసే బంగారు ఆభరణాలే కొట్టేశారట. అక్కడ కొట్టేయడం మామూలే అయినా.. కొట్టేసిన పద్దతి చూస్తే ఔరా అనుకోవాల్సిందే. బ్యాగు పోయిందని బాధితుడికి తెలిసినా పట్టుకోలేని అసమర్థ స్థితిలో అక్కడి దొంగలు ప్లాన్​ చేస్తారట. ఇటీవల దొరికిన కొంత మందిని విచారించగా ఈ విషయం బయటపడింది.

ఇంకా చదవండి ...


    ముంబై మహానగరం.. దేశంలోని నగరాలతో పోలిస్తే అక్కడ రద్దీ చాలా ఎక్కువ. ఆ రద్దీను ఆసరాగా చేసుకుని దొంగలు పేట్రేగిపోతుంటారు అక్కడ. లోకల్​ రైళ్లు,బస్సుల్లో అయితే దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. కేవలం దొంగలను పట్టుకోవడానికే లోకల్​ రైల్వేస్టేషన్లలో పోలీసులు సీసీకెమెరాలు బిగించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇటీవల.. కొందరు దొంగలు ఓ బస్సులో ఏకంగా రూ.46 లక్షలు విలువజేసే బంగారు ఆభరణాలే కొట్టేశారట. అక్కడ కొట్టేయడం మామూలే అయినా.. కొట్టేసిన పద్దతి చూస్తే ఔరా అనుకోవాల్సిందే. బ్యాగు పోయిందని బాధితుడికి తెలిసినా పట్టుకోలేని అసమర్థ స్థితిలో అక్కడి దొంగలు ప్లాన్​ చేస్తారట. ఇటీవల దొరికిన కొంత మందిని విచారించగా ఈ విషయం బయటపడింది. ఇంతకు వారు దొంగతనాలు ఎలా చేస్తారో తెలుసా.. టార్గెట్​ను కన్​ప్యూజ్​ చేసి.. అవునండీ బాబు.. బాధితుడి వద్ద నుంచి దొంగలించడం ఒకరిపని అయితే ఆ దొంగ దొరక్కుండా బాధితుడి దృష్టిని మరల్చేవారు మరికొందరు.. ఇంతకు ఎవరా దొంగలు.. ఎక్కడ పట్టుబడ్డారు.. తెలుసుకుందాం..

    ఇటీవలె ముంబైలోని రద్దీగా ఉండే బస్సులో ఓ నగల దుకాణంలో పనిచేసే ఉద్యోగి పని మీద వెళుతున్నాడు. ఆ ఉద్యోగి బ్యాగులో రూ.46.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీంతో దొంగలు పక్కా పథకం ప్రకారం బ్యాగ్‌ను దొంగిలించారు. అయితే నగలు పోయాయని పసిగట్టిన ఉద్యోగి చుటుపక్కల వారిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించాడు. అంతే ముఠాలోని మరికొందరు అతడిని కలవరపెట్టారు. తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. దీంతో సదరు బాధితుడు కన్​ప్యూజ్​ అయ్యాడు. దొంగలు పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన సబర్బన్ అంధేరీ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. నిందితుల్లో కొంతమందిని గుర్తించినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ (జోన్ 10) మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

    ఈ దొంగల ముఠా బస్పులు, రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దోచేస్తోంది. ఈ బ్యాగ్‌ స్నాచర్ల ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిని మహేంద్ర మోరే (45), మనోజ్ మేధే (33), అమిన్ షేక్ (49), శశికాంత్ కొల్వాల్కర్ (63), విజయ్‌కుమార్ గుప్తా (38), మనీష్ దర్జీ (34), శైతాన్సింగ్ రాజ్‌పుత్ (38)లు గా గుర్తించారు. వారిని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులో పట్టుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ముఠాను గుర్తించడానికి ఓ పోలీసు బృందం రాజస్థాన్‌లో కూడా పర్యటించిందని అధికారి తెలిపారు.  నిందితుల్లో ఆరుగురు ముంబైకి చెందినవారు కాగా, ఒకరు రాజస్థాన్‌కు చెందిన వారు అని ఆయన చెప్పారు. వారి నుంచి రూ.24.28 లక్షల విలువైన 475 గ్రాముల బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime, Maharashtra, Mumbai Police, Thief Arrested

    తదుపరి వార్తలు