Thives Stolen ATM Wih JCB : మహారాష్ట్ర(Maharashtra)లో షాకింగ్ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని సాంగ్లీలోలోని మిరాజ్ ప్రాంతంలో ఓ విచిత్రమైన రీతిలో ఏటీఎం మెషీన్ చోరీకి గురైంది. శనివారం అర్థరాత్రి మిరాజ్ ప్రాంతంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మెషీన్ ని..జేసీబీని ఉపయోగించి మరీ దొంగిలించారు దుండగులు .దొంగలు ఏకంగా జేసీబీతో లోపలికి ప్రవేశించి ఏటీఎం యంత్రాన్ని పెకిలించి.. బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
సీసీటీవీ ఫుటేజీలో...ఒక వ్యక్తి ఏటీఎం(ATM Machine)లోకి ప్రవేశించి, ఆపై అకస్మాత్తుగా బయటకు వెళ్లడం కనిపించింది. ఆ తర్వాత జేసీబీ యంత్రం ఏటీఎం అద్దాలను ధ్వంసం చేస్తూ కనిపించింది. జేసీబీ సాయంతో ఏటీఎం మిషన్‌ను అపహరించారు. చోరీకి గురైన ఎటిఎం మిషన్ యాక్సిస్ బ్యాంక్‌కు చెందినదని మిరాజ్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రకాంత్ బేద్రే తెలిపారు.పెట్రోలు పంపు నుంచి మొదట జేసీబీని దొంగిలించారని, ఆ తర్వాత దానిని ఏటీఎం దొంగిలించడానికి ఉపయోగించారని చంద్రకాంత్ బేద్రే తెలిపారు. ఏటీఎం మెషిన్లో రూ.27 లక్షల నగదు ఉందని చెప్పారు. ఇతర సీనియర్ పోలీసు అధికారులు కూడా ఏటీఎం చోరీకి గురైన స్థలాన్ని సందర్శించారని... జేసీబీ చోరీకి గురైన పెట్రోల్ పంప్‌లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను కనిపెడతాం అని అన్నారు.
అయితే మనదేశంలో ఇలాంటి విచిత్రమైన రీతిలో దొంగతనాలు కొత్తవేమీ కాదు. ఇటీవల బీహార్ లోని రోహ్తాస్ జిల్లా అమియావార్ లో ఓ పాత ఇనుప వంతెనను దొంగలు మూడు రోజుల్లోనే మాయంచేశారు. ఇంకో చిత్రమేంటంటే, స్థానిక సిబ్బంది, గ్రామస్థులు కూడా వీరికి సహకరించారు. ముక్కలు చేసిన వంతెనను లారీల్లోకి ఎక్కించింది స్థానికులే. పాత బ్రిడ్జికూలితే ప్రమాదమని, కూల్చివేయాలని గ్రామస్థులు ఇంతకుముందే అధికారులకు విన్నవించుకున్నారు. ఇదే అదునుగా దొంగలు వచ్చారు, దర్జాగా దోచుకెళ్లారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.