ఎమ్మెల్యేల ఇళ్లకు కన్నాలు వేస్తున్న దొంగలు.. ముగ్గురి ఇళ్లలో చోరీలు..

ఫ్రతీకాత్మక చిత్రం

ఎమ్మెల్యేల ఇళ్లకే కన్నం వేస్తున్నారు దొంగలు. టార్గెట్ చేసి మరీ ఎమ్మెల్యేల ఇళ్లకు కన్నాలు వేస్తున్నారు. ఔను. మీరు చదివింది కరెక్టే. ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లను టార్గెట్ చేశారు దొంగలు.

  • Share this:
    ప్రస్తుతం భారతదేశంలో ఓ ఎమ్మెల్యే ఇల్లు అంటే పెద్ద మందీ మార్బలం. పెద్ద కోట లాంటి ఇల్లు. దాని చుట్టూ పెద్ద ప్రహరీ గోడ. అక్కడ బందోబస్తు. వచ్చేపోయే జనాలు. భారీగా జనసందోహం. కార్యకర్తలు, ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు, కలిసిపోవడానికి వచ్చే కాంట్రాక్టర్లు.. ఇలా చాలా హడావిడిగా ఉంటుంది. అక్కడ కచ్చితంగా పోలీసులు ఉంటారు. అయితే, అలాంటి ఎమ్మెల్యేల ఇళ్లకే కన్నం వేస్తున్నారు దొంగలు. టార్గెట్ చేసి మరీ ఎమ్మెల్యేల ఇళ్లకు కన్నాలు వేస్తున్నారు. ఔను. మీరు చదివింది కరెక్టే. ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లను టార్గెట్ చేశారు దొంగలు.

    బీహార్లో  (Bihar) ఈ ఘటన జరిగింది. గత 15 రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లలో దొంగలు పడ్డారు. అందులో ఒకరు అధికార జేడీయూకి (JDU) చెందిన ఎమ్మెల్యే. మరొకరు కాంగ్రెస్ పార్టీ (Congress), ఇంకొకరు ఆర్జేడీ (RJD) ఎమ్మెల్యే. సెప్టెంబర్ 1వ తేదీన జేడీయూ ఎమ్మెల్యే షాలిని మిశ్రా ఇంట్లో దొంగలు పడ్డారు. చంపారన్ జిల్లాలోని మోతిహారీలో ఉండే ఆమె ఇంట్లోకి చొరబది రూ.27,000 నగదు, రూ.లక్ష విలువైన బంగారం, కొన్ని ముఖ్యమైన పత్రాలు దోచుకెళ్లారు.

    జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్..? ఈ శుక్రవారం ఏం జరగబోతోంది..?


    ఇక సెప్టెంబర్ 12న నేవడలోని ఆర్జేడీ ఎమ్మెల్యే విభాదేవి ఇంట్లో చోరులు ప్రవేశించారు. రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కప్ బోర్డులో పెట్టిన డబ్బు కనిపించకపోయేసరికి ఆమెకు అసలు విషయం తెలిసింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    సార్..​ నాకు అమ్మాయిలు పడటం లేదు.. మీరే గర్ల్​ఫ్రెండ్​ను చూసి పెట్టండంటూ ఎమ్మెల్యేకు లేఖ రాసిన యువకుడు


    తాజాగా ఔరంగాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ శంకర్ సింగ్ ఇంటి వద్ద చోరీ జరిగింది. ఆయనకు బాడీగార్డ్‌గా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తన మోటార్ బైక్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బైక్ మీద ఎమ్మెల్యే ఇంటికి వెళ్లానని, అక్కడి నుంచి ఎమ్మెల్యేతో పాటు టూర్‌కు వెళ్లానని, తిరిగి వచ్చి చూసేసరికి తన బైక్ చోరీకి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    పగటిపూట నిద్ర మంచిదా...? అలా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా..?


    ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేది సగటు ప్రజల ఆవేదన. అయితే, ఎమ్మెల్యేల ఇళ్లలో చోరీలు ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లోని కప్ బోర్డులో పెట్టిన డబ్బులు పోవడం అంటే బాగా తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు.

    ఆ కామాంధుడి ఆచూకీ చెబితే గోప్యంగా ఉంచుతామన్న సీపీ అంజనీకుమార్‌​.. 10 లక్షల రివార్డూ ఇస్తామని ప్రకటన

    ఇక మరో ఎమ్మెల్యే ఇంట్లోని కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా చోరీకి గురవడాన్ని బట్టి చూస్తే అది కూడా బాగా తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఇళ్లలో పనిచేసే వారిని ప్రశ్నిస్తున్నారు. ఆ చుట్టుపక్కల సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: