జడ్జి ఇంట్లో చందనం చెట్లు కొట్టుకెళ్లిన దొంగలు...

ఉత్తరప్రదేశ్‌‌లోని కన్నోజ్‌కు చెందిన బ్యాచ్ ఈ దొంగతనానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

news18-telugu
Updated: November 17, 2019, 8:32 PM IST
జడ్జి ఇంట్లో చందనం చెట్లు కొట్టుకెళ్లిన దొంగలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మధ్యప్రదేశ్‌లో ఓ జడ్జి ఇంట్లోనే దొంగలు పడ్డారు. జడ్జి ఇంటి ముందు ఉన్న చందనం చెట్లు నరికి తీసుకెళ్లారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఈ ఘటన జరిగింది. రేవాలో ఉన్న జిల్లా మరియి సెషన్స్ జడ్జి అరుణ్ కుమార్ సింగ్ బంగ్లాకు నలుగురు కాపలా ఉన్నారు. నలుగురూ తలో దిక్కున పహారా కాస్తున్నారు. బంగ్లా వెనుక భాగంలో బుద్ధిలాల్ కోల్ అనే గార్డు కాపలా కాస్తున్నాడు. తొలుత ఐదుగురు దొంగలు అతడి వద్దకు వచ్చి.. ఓ నాటు తుపాకితో బెదిరించారు. అనంతరం అతడి చేతులు, కాళ్లు కట్టేసి నోట్లో దుస్తులు కుక్కారు. ఆ తర్వాత పెరట్లోకి ప్రవేశించి ఎంచక్కా చందనం చెట్లు కొట్టి.. ఆ దుంగలను ఎత్తుకుని వెళ్లారు. ఆ సమయంలో జడ్జి, ఆయన కుటుంబసభ్యులు నిద్రపోతున్నారు. దొంగలు పారిపోయిన తర్వాత ఎప్పటికో మరో గార్డు చేతులు, కాళ్లు కట్టేసి ఉన్న బుద్ధిలాల్‌ను గమనించి అతడి కట్లు విప్పాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌‌లోని కన్నోజ్‌కు చెందిన బ్యాచ్ ఈ దొంగతనానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో చందనం ఉత్పత్తులు, సుగంధ పరిమళాలు తయారు చేసే యూనిట్లు ఉన్నాయి. వారే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. నరికి తీసుకెళ్లిన చెట్లు విలువ సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com