దొంగలు బ్యాంకు రాబరీ చేయడం చూశాం. డబ్బు కోసం ఏటీఎంలు ధ్వంసం చేయడం విన్నాం. ఇళ్లలో చొరబడి చోరీలు చేయడం, నగలు, డబ్బు ఎత్తుకెళ్లడం సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కాని రాజస్థాన్rajasthanలో ఓ దొంగల ముఠా గుడితో పాటు గుడిలో లింగాన్ని మింగారనే సామెతను పక్కాగా ఫాలో అయ్యారు. చోరీ, రాబరీ కాకుండా ఏకంగా ఓ డీసీఎం వ్యాన్ తీసుకొచ్చి ఏటీఎం(ATM) తలుపులు పగలగొట్టి మిషన్(Machine)ను ఎత్తుకెళ్లారు. అయితే అందులో ఉన్న లక్షల రూపాయల క్యాష్ ఉండటంతో పోలీసులు(Police) దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాయి. చోరీ చేస్తున్న వీడియో(Video)ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో వైరల్ (Viral)అవుతోంది.
జైపూర్‌లో జాదుగాళ్లు..
రాజస్థాన్‌లో ఓ దొంగల ముఠా రెచ్చిపోయింది. జైపూర్‌లోని బగ్రులింక్ రోడ్డులో ఉన్న ఓ ఏటీఎం సెంటర్‌ని టార్గెట్‌గా చేసింది చోర్ గ్యాంగ్. పక్కా పథకం ప్రకారం ఏటీఎం మిషన్‌లో నగదు నింపిన తర్వాత టైమ్ చూసుకొని రాత్రి వేళ ఆరుగురు దొంగలు ఓ మినీ లారీతో చోరీ చేసేందుకు ఏటీఎం సెంటర్‌కు వచ్చారు. ఎవరూ గుర్తు పట్టకుండా అందరూ బ్లాక్ డ్రెస్‌లు, ముఖాలు కనిపించకుండా మాస్క్‌లతో కవర్ చేసుకున్నారు. ముందుగా వాహనంతో ఏటీఎం సెంటర్ డోర్‌ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత మినీ లారీలో ఉన్న నలుగురు దొంగలు కిందకు దిగి ..ఏకంగా ఏటీఎం మిషన్‌ను లారీలో ఎక్కించుకొని అక్కడి నుంచి పారిపోయారు. దుండగులు ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లిన వీడియో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏటీఎం మిషన్ మాయం కేటుగాళ్లు..
ఏటీఎంలో క్యాష్ మిషన్ చోరీకి గురైనట్లుగా బ్యాంక్ అధికారులు జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ జరిగిన బగ్రులింక్ రోడ్డు దగ్గరున్న ఏటీఎం సెంటర్‌కు వచ్చి పరిశీలించారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు అక్కడున్న సీసీ ఫుటేజీ సేకరించారు. దాన్ని ఆదారంగానే నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చోరీ చేసిన వాళ్ల ఫోటోలను అన్నీ పోలీస్ స్టేషన్‌లకు, చెక్‌పోస్టులకు పంపి అప్రమత్తం చేశారు. ఏటీఎం మిషన్‌లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందన్న అధికారుల కంప్లైంట్‌తో వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Atm centre, Rajasthan, Viral Video