హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘దాక్కో దాక్కో మేక.. దొంగొచ్చి పడతాడు పీక’.. అవును.. గుట్టుచప్పుడు కాకుండా వాళ్లు ఎలా దొంగతనం చేస్తున్నారో చూడండి..

‘దాక్కో దాక్కో మేక.. దొంగొచ్చి పడతాడు పీక’.. అవును.. గుట్టుచప్పుడు కాకుండా వాళ్లు ఎలా దొంగతనం చేస్తున్నారో చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OMG: దొంగతనం చేసే వాళ్లు సాధారణంగా ఇంట్లోకి చొరబడి బంగారం లేదా డబ్బులు ఎత్తుకెళ్లి జల్సాలు చేస్తుంటారు. లేదా దారిదోపిడీలు చేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తారు. కానీ ఇక్కడ మనం చెప్పుకునే దొంగ మామూలు కాదు. తెలిస్తే మీరు షాక్ అవుతారు.. వివవరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...

(K.Veeranna,News18,Medak)

దొంగతనం చేసే వాళ్లు సాధారణంగా ఇంట్లోకి చొరబడి బంగారం లేదా డబ్బులు ఎత్తుకెళ్లి జల్సాలు చేస్తుంటారు. లేదా దారిదోపిడీలు చేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తారు. లేదంటే.. చైన్ స్నాచింగ్ లు, బైక్ దొంగలు చూశాం. కానీ ఇక్కడ వాళ్లు చేసే దొంగతనం మాత్రం వెరైటీ అనే చెప్పాలి. రాత్రి సమయంలో మేకలు, గొర్రెలను ఎత్తుకెళ్లి.. రాత్రికి రాత్రే వాటిని అమ్ముకొని ఏమి తెలియనట్టు ఇంటి బాట పడుతున్నారు. పెద్ద దొంగల ముఠా చేస్తుందనుకుంటే పొరపాటే. ఈ దొంగతనం చేసేది కేవలం నలుగురు మాత్రమే. ఇలా విక్రయించగా సుమారు రూ. 16 వేల నుంచి రూ.18 వేల వరకు వస్తాయి. వాటితో జల్సాలకు పాల్పడుతూ ఉంటారు.

Minor Girl: అతడు తాత వరుస అవుతాడు.. టీవీ చూసేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికను.. అత్యంత దారుణంగా..


ఇలా ఒక దగ్గర కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో రాత్రి పూట.. గుంపుగా ఉన్న మేకలు, గొర్రెల కొట్టంలోకి వెళ్లి ఇలా చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు మాత్రం దొరకడం లేదు. వాళ్లను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా విడిపోయి వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. దుబ్బాక మండలానికి చెందిన గోపన్ పల్లి గ్రామంలో కలకుంట్ల కరుణాకర్ బతుకు దెరువు కోసం తోగుట మండలం వెంకట్రావ్ పేట్ వెళ్లి అక్కడ కూలీ పనులు చేసుకుంటూ నివసించేవాడు.

మీకు కనిపించే ఈ వ్యక్తి పోలీయోవ్యాధిగ్రస్తుడు.. కానీ అతడు చేసిన పని తెలిస్తే.. చెప్పు తీసుకుంటారు..


అక్కడ మరో నలుగురు కులీ పనిచేసే వ్యక్తులు పరిచయమయ్యారు. ఆ నలుగురితో పాటు కరుణాకర్ రోజు వారితో మద్యం సేవించే వాడు. కూలీ పనులు చేసిన తర్వాత వచ్చే డబ్బులు వాళ్ల తాగుడుకు కూడా సరిపోయేవి కావు. దీంతో వాళ్లు ఓ మాస్టార్ ప్లాన్ కు దిగారు. చుట్టుపక్కల గ్రామాల్లో మేకలు, గొర్రెలను దొంగతనం చేసి.. మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఆ రోజు నుంచి ఇక కూలీకి కూడా వెల్లడం మానేశారు. పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి అయ్యే సరికి అక్కడ మకాం వేసి.. గొర్రెలను, మేకలను గుట్టుచప్పుడు కాకుండా.. వాటి నోటికి చేతులను గట్టిగా పట్టుకొని దొంగతనం చేసేవారు.

పోలీసులు ఓ రోజు దుబ్బాక పట్టణంలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. వాహనాలపై మేకలు తెస్తున్న వారు.. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో ఒకరు పారిపోగా.. మరో ముగ్గురు పోలీసులకు చిక్కారు. వారితో పాటు రెండు జీవాలను, రెండు ద్విచక్రవాహనాలను అంతే కాకుండా రూ.79 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime, Crime news, Medak Dist, Siddipeta

ఉత్తమ కథలు