బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా(With draw) చేసుకొని వెళ్లే వాళ్లను దొంగలు(Thieves) ఫాలో అవుతారు. అందుకే బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకెళ్లే సమయంలో కాస్త వెనుక, ముందు చూసుకోవాలి. లేదంటే మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని దామోహ్(Damoh)లో ఓ పటేల్‌కి జరిగిన నష్టమే అందరికి జరుగుతుందని గ్రహించాలి.సద్గువ గ్రామానికి చెందిన పటేల్జీ అనే కూరగాయల వ్యాపారి బ్యాంక్Bank నుంచి లక్ష రూపాయలకుపైగా నగదు తీసుకొని బయటకు వచ్చాడు. మూడు రోడ్ల కూడలి దగ్గరున్న పండ్ల దుకాణంలో మామిడి పండ్లు (Mangos)కొనుక్కుందామని డబ్బులున్న బ్యాగ్(Cash bag)ని తన బైక్‌పై పెట్టి పండ్ల వ్యాపారితో బేరమాడుతున్నాడు. ఇంతలోనే ఓ బైక్ వచ్చి పండ్ల దుకాణం దగ్గర ఆగింది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు వేసుకొని వచ్చారు. బైక్ నడపుడుతున్న వ్యక్తి కాకుండా వెనుక కూర్చున్న మరో వ్యక్తి పటేల్(Patel)బైక్‌పై పెట్టుకున్న డబ్బుల సంచిని తీసుకొని పరార్ అయ్యారు. డబ్బుల సంచి తీసుకొని పారిపోతున్న దొంగలను రైతు చూసి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కొంత దూరం బైక్‌ని వెంబడిస్తూ పరిగెత్తాడు. అప్పటికే దొంగలు బైక్ స్పీడుగా డ్రైవ్ చేసుకొని అక్కడి నుంచి మాయమైపోయారు. నడిరోడ్డుపైన పట్టపగలు అందరూ చూస్తుండగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా(CCTV camera)లో రికార్డైంది. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నగదు పోగొట్టుకున్న బాధితుడు హోల్‌సేల్ మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చుకునేందుకు బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకొచ్చాడు. వాటిని దొంగలు ఎత్తుకెళ్లడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
డబ్బు ఎవరికి ఊరికే రాదు..
దామోహ్ జిల్లా కేంద్రంలో జరిగిన దోపిడీతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన ప్రదేశంలోని సీసీ ఫుటేజ్ సేకరించారు. ఫుటేజ్‌లోని బైక్ నెంబర్ ఆధారంగా నిందితుల్ని పట్టుకుంటామని కేసు నమోదు చేసుకున్న అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివకుమార్ సింగ్ తెలిపారు.
కొంప ముంచిన నిర్లక్ష్యం..
దామోహ్ జిల్లాలో నేరస్తులు పెరిగిపోయారు. నేరాల సంఖ్య కూడా పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఏ వైపు నుంచి దొంగలు వచ్చి దోపిడీలకు తెగబడతారో తెలియదని..అందుకే పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని..నగదును బైక్‌లు, కార్ల సీట్లపై పెట్టకుండా చేతుల్లో పట్టుుకోవాలని సూచించారు. చోరీకి పాల్పడిన దొంగల్ని పట్టుకొని సొత్తును రికవరీ చేసి అప్పగిస్తామనిల బాధితుడికి భరోసా ఇచ్చారు పోలీసులు. చోరీకి సంబందించి వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు వేర్వేరు తీరుగా స్పందిస్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Madhya pradesh