ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా దొంగలు అంతకు మించిన దారుణాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా బంగారు నగల షాపులు, పెద్ద సూపర్ మార్కెట్లలోకి పట్టపగలు, మారణాయుధాలు చూపించి బెదిరిస్తూ డబ్బు, నగలు అందిన వరకు దోచుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో పట్టపగలు ఓ షాపులో దోపిడీ దొంగలు చొరబడి రాబరీ చేసిన తీరు చూస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ మౌ(Mau) జిల్లాలోని రాణిపూర్ (Ranipur)పోలీస్ స్టేషన్(Police Station)పరిధిలోని ఖుర్హత్ మార్కెట్ (Khurhat Market)లో కలకలం రేపింది. ఈనెల 24వ తేదిన ముగ్గురు దుండగులు(Thieves)పిస్టోల్స్ పట్టుకొని మార్కెట్లో ఉన్న ఓ జువెలరీ షాపు(Jewelery shop)లోకి చొరబడ్డారు. దొంగలు ఎంటరైనప్పటి నుంచి దాడి చేయడం, నగలు, డబ్బు దోచుకెళ్లడం, షాపు యజమాని వారితో ఫైటింగ్‌కి దిగడం అంతా రికార్డవుతున్నా...దొంగలు రెచ్చిపోయారు. పెద్ద మొత్తంలో డబ్బు, నగలు ఎత్తుకెళ్తున్న దొంగల్ని పట్టుకునేందుకు షాపు యజమాని తీవ్రంగా శ్రమించాడు. దొంగల్ని నిలువరించేందుకు సైతం తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. ముగ్గురు దొంగల్లో ఒకడు నగలు సంచి తీసుకొని పారిపోగా..మరొకడు కౌంటర్(Counter)లోని డబ్బు, ఇతర వస్తువుల్ని మరో సంచిలో వేసుకున్నాడు. షాపులో పడ్డ దొంగలు నగలు, నగదు మొత్తం ఎత్తుకెళ్తున్నట్లు గ్రహించిన షాపు ఓనర్(Shop owner) ..ఎట్టకేలకు ఒకడ్ని గట్టిగా పట్టుకొని వదల్లేదు. మిగిలి ఇద్దరూ పరార్ అయ్యారు. చేతుల్లో పిస్టోల్స్ పట్టుకున్న దొంగలతో షాపు యజమాని పోరాడం చూసిన స్థానికులు భయపడిపోయారు.
పట్టపగలే రాబరీ..
రాణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగల షాపులో జరిగిన రాబరీ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. నగలు ఎత్తుకెళ్తున్న ముగ్గురిలో ఒకడ్ని షాపు ఓనర్ పట్టుకొని పోలీసులకు పట్టించడంతో చోరీ కేసు నమోదు చేశారు పోలీసులు. మిగిలిన ఇద్దరి ఆచూకి చెప్పమని పట్టుబడిన దొంగను ప్రశ్నిస్తున్నారు. తన షాపులో దొంగిలించిన నగదు, నగల వివరాలను పోలీసులకు చెప్పాడు షాపు యజమాని. దుండగులు చేసిన దాడిలో షాపు యజమానికి స్వల్ప గాయాలయ్యాయి.
ఒకడు దొరికాడు..
పట్టపగలు అందరూ చూస్తుండగా షాపులో దుండగులు చొరబడటం, ఓనర్ని కొట్టి నగలు, నగదును సంచుల్లో వేసుకొని తీసుకెళ్లడంతో స్థానికంగా ఉంటున్న మరికొందరు వ్యాపారాలు భయపడిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్‌లోని వీడియో ఆధారంగా పారిపోయిన ఇద్దరు దొంగల ఊహా చిత్రాలను తీశారు. వాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తామన్నారు. చోరీకి గురైన మొత్తం నగదు, నగలను షాపు ఓనర్‌కి అప్పగిస్తామని పోలీసుల భరోసా ఇచ్చారు. నగల షాపు ఓనర్ వ్యవహరించినట్లు మిగిలిన వ్యాపారులు కూడా ఇలాంటి దోపిడీ దొంగలు వచ్చినప్పుడు తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.