Home /News /crime /

THIEVES PERFORM POOJA BEFORE LOOTING GOLD AND CASH WORTH RS 34 LAKH FROM KERALA BANK LEAVE NOTE FOR POLICE PAH

OMG: వామ్మో.. చోరీకి ముందు భక్తితో పూజలు.. వెళ్లెటప్పుడు పోలీసులకు నోట్.. స్కెచ్ మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kerala Bank: కొందరు రాత్రిపూట బ్యాంక్ కు చోరి చేయడానికి వచ్చారు. లాకర్ కౌంటర్ వద్ద పూజలు చేశారు. అక్కడ కొన్ని వెంట్రుకలు, పోలీసులకు ఒక నోట్ కూడా వదిలి వెళ్లారు.

మనం చేసే ప్రతిపనిలో మన హర్డ్ వర్క్ తో పాటు.. దేవుని అనుగ్రహం కూడా ఉండాలి. అప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చని పెద్దలు తరచుగా చెప్తు ఉంటారు. కేవలం దేవుని ముందు దీపంపెట్టి దేవుడా.. నువ్వే దిక్కు అనుకుంటే పనులు కావు. మన వంతు కూడా కృషి ఉంటేనే చేసే ఏపనిలో అయిన విజయం సాధిస్తాం. అయితే, ఈ పెద్దలు చెప్పిన మంచి మాటలను.. మనం ఆచరిస్తామో కానీ ఈ దొంగలు తూచా తప్పకుండా పాటించారు. చోరికి వచ్చి తమ పని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం దొంగతనానికి సంబంధించిన ఘటన వెలుగులోనికి రావడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. కేరళలో (Kerala) ఒక విచిత్రమైన దొంగతనం ఆలస్యంగా బయటపడింది. కొల్లాం జిల్లాలోని స్థానికంగా ఉన్న బ్యాంక్ లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. పత్తనాపురం పరిధిలోని జనతా జంక్షన్ లోని లోని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ పఠాన పురం బ్యాంకర్స్ ను నిర్వహిస్తుంది. అయితే, ప్రతి రోజు లాగే బ్యాంక్ సిబ్బంది ఉదయాన్నే బ్యాంక్ తాళాలు తీయడానికి వచ్చారు. అయితే, అప్పటికే షట్టర్ తెరిచిఉంది. అక్కడ వస్తువులు చిందర వందరగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో చోరి జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ప్రకారం.. సదరు బ్యాంక్ మొదటి అంతస్థులో ఉంది. దొంగలు మూడో అంతస్థునుంచి మొదటి అంతస్థులోనికి ప్రవేశించారు.ఆ తర్వాత.. ప్రత్యేకమైన కట్టర్ తో అక్కడి లాకర్ తాళాలను పగలకొట్టారు. దొంగలంతా ముసుగులు ధరించి ఉన్నారు. అక్కడ ఉన్న రెండు లాకర్లను తెరిచారు. దాదాపు.. 30 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే, చోరి జరిగిన ప్రదేశంచూసి పోలీసులు, బ్యాంక్ అధికారులు అవాక్కయ్యారు. అక్కడ ఫోటో, నిమ్మకాయలు, తమలపాకులు, ఉండటాన్ని గమనించారు.

దీన్ని బట్టి చోరికి ముందు పూజలు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా, కొన్ని వెంట్రుకలు కుప్పగా ఉంచారు. దాని పక్కన.. నేను చాలా డేంజర్.. పట్టుకొవడానికి ట్రై చేయోద్దంటూ కూడా వార్నింగ్ ఇస్తూ నోట్ రాశారు. దీన్ని బట్టి వారు పోలీసుల జాగీలాన్ని తప్పుదొవపట్టించడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. కాగా, బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ రప్పించారు. నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bank, Kerala, Theft

తదుపరి వార్తలు