ఇంట్లో ఖరీదైన వస్తువులు ఎందుకు ఉంచలేదు..? దంపతులను నిలదీసిన దొంగలు

’దొంగలంటే ఇంత కూడా భయం లేదా..? అందరూ ఇలా బ్యాంకు లాకర్లలో దాచుకుంటే మాలాంటోళ్ల పరిస్థితేంటి..? మేము బతకొద్దా...? మాకు భార్యాపిల్లలుండరా..? మనుషుల్లో అసలు మానవత్వమే లేకుండా పోతుంది...? ’.. రాత్రి దొంగతనానికి ఇంటికొచ్చిన దొంగ పై మాటలంటే మీరెలా రియాక్ట్ అవుతారు..

news18
Updated: November 14, 2020, 8:50 AM IST
ఇంట్లో ఖరీదైన వస్తువులు ఎందుకు ఉంచలేదు..? దంపతులను నిలదీసిన దొంగలు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 14, 2020, 8:50 AM IST
  • Share this:
‘ఛీ.. ఛీ.. ఇంత కష్టపడి ఈ ఇంటికొస్తే ఇక్కడ ఏమీ లేదు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇందులో కనీసం ఓ కోటి రూపాయల విలువ చేసే బంగారమో.. వజ్ర వైడుర్యాలో కొని పెట్టుకోరా..? మేమొస్తామని తెలియదా..? మరి చీరలు, గిన్నెలను ఎత్తుకుపోతామా ఏంటి..? దొంగలంటే ఇంత కూడా గౌరవం లేదా..? అందరూ ఇలా బ్యాంకు లాకర్లలో దాచుకుంటే మాలాంటోళ్ల పరిస్థితేంటి..? మేము బతకొద్దా...? మాకు భార్యాపిల్లలుండరా..? మనుషుల్లో అసలు మానవత్వమే లేకుండా పోతుంది...? ’.. రాత్రి దొంగతనానికి ఇంటికొచ్చిన దొంగ పై మాటలంటే మీరెలా రియాక్ట్ అవుతారు. ఏంటీ..? దొంగలలా ఎందుకు మాట్లాడుతారు..? ఇంట్లో ఏమీ లేకుంటే చడీ చప్పుడు కాకుండా వెళ్తారు కదా..? అనుకుంటున్నారా..? అది పాతకాలం. ఇది కోవిడ్ కాలం. ఇప్పుడింతే. నమ్మకం కలగడం లేదా..? అయితే ఇది చదవండి.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో గల గుమ్మడిపుండి ఏరియాలో ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు అంతస్థుల భవనంలో నివాసముంటున్న ఏకాబరం, కాసియమ్మల్ అనే దంపతులకు ఒక కొడుకు. ఆయన తన భార్యాపిల్లలతో పై అంతస్థులో ఉంటున్నాడు. కింద వృద్ధ దంపతులు ఉంటున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఆ దంపతులు ఉంటున్న ఇంట్లోకి రాత్రి 9 గంటల సమయంలో ఐదుగురు సభ్యుల ముఠా ఒకటి ప్రవేశించింది. అప్పుడే భోజనం చేసి ఇక నిద్ర పోదామనుకుంటున్న ఆ దంపతులు వారు చూడగానే.. ఎవరు మీరు అని అడిగారు. కానీ అందులో ఒక వ్యక్తి వారిని కూర్చోమని.. కదిలినా.. అరిచినా చంపేస్తామని బెదిరించాడు.

మిగిలిన నలుగురు ఇంట్లోకి వెళ్లి అంతా తిరిగారు. బెడ్ రూం, బీరువాలు, అల్మారాలు, సెల్ఫ్స్.. అన్నీ వెతికారు. చిల్లి గవ్వ కూడా దొరకలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దొంగల ముఠా... ఆ దంపతుల దగ్గరకు వచ్చారు. వస్తూ వస్తూనే.. ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని విలువైన వస్తువులు ఎందుకు ఉంచలేదని నిలదీశారు. ఇంట్లో చీరలు, దోతులు, గిన్నెలు తప్ప బంగారం.. వెండి వంటివి ఏమీ లేవని ఊగిపోయారు. విలువైన వస్తువులుల ఎందుకు కొనలేదని ఆ దంపతులను కొట్టినంత పనిచేశారు. కానీ ఆ దంపతుల నోట మాట పెకల్లేదు.

చివరికి కిచెన్, పూజ గదిలోకి వెళ్లి.. వెండి గిన్నెలు సంపాదించారు. బీరువాలోకి వెళ్లి కొన్ని చీరలను తీసుకుని.. అసంతృప్తితో అక్కడ్నుంచి బయల్దేరారు. పోతూ.. పోతూ.. ఇంట్లో విలువైన వస్తువులను దాచనందుకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ అంతలోనే పై నుంచి ఏదో అలికిడి వినబడిన తర్వాత ఆ ముఠా అక్కడ్నుంచి ఉడాయించింది.  బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Published by: Srinivas Munigala
First published: November 14, 2020, 8:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading