రేకుల పైకి ఎక్కి.. గోడ పగులగొట్టి.. మద్యం దుకాణంలో లక్ష విలువైన మద్యం చోరీ

హైదరాబాద్ గాంధీనగర్‌లో ఓ మద్యం దుకాణంలో గుర్తు తెలియని దుండగులు మద్యం బాటిళ్ల చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ.లక్ష విలువైన మద్యం బాటిళ్లతో పాటు రూ.15వేల నగదును దోచుకెళ్లారు.

news18-telugu
Updated: April 4, 2020, 6:11 PM IST
రేకుల పైకి ఎక్కి.. గోడ పగులగొట్టి.. మద్యం దుకాణంలో లక్ష విలువైన మద్యం చోరీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌తో కరోనా వైరస్ నియంత్రణేమో గానీ మందుబాబులు ముప్పుతిప్పలు పడుతున్నారు. మద్యం దొరక్క కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరికొంతమంది మత్తును ఎక్కించుకునేందుకు వివిధ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఏకంగా మద్యం చోరీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ నగర్‌లో ఉన్నశ్రీ వెంకటేశ్వర వైన్స్‌లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు భారీ మద్యం చోరీకి పాల్పడ్డారు. వైన్స్ వెనుక భాగంలో రేకులు వంచి లోపలికి వెళ్లి గోడకు రంధ్రం చేశారు.

రంధ్రంలో నుంచి వైన్స్ లోపిలికి ప్రవేశించి చోరీ చేశారు. రూ.లక్ష విలువైన పలు బ్రాండ్ల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. మద్యం బాటిళ్లతో పాటు రూ.15వేల నగదును పట్టుకుపోయారు. ఇద్దరు వ్యక్తులు ఈ చోరీ చేసినట్టు సీసీ పుటేజీల్లో తెలుస్తోంది. అయితే ఈ చోరీ మద్యం బాబులు చేశారా.. లేక మరేవరైనా మద్యాన్ని బ్లాక్‌లో అమ్ముకునేందుకు చోరీకి పాల్పడ్డారా అనేది తేలాల్సి ఉంది. అయితే వైన్స్‌లోని సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే.. నగరంలో మద్యం చోరీకి పాల్పడిన ఘటనలు ఇప్పటికే పేట్ బషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇటు వైన్స్ యాజమానులకు.. అటు పోలీసులకు కొత్త టెన్షన్ మొదలయ్యింది.
Published by: Narsimha Badhini
First published: April 4, 2020, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading