Thiefs Letter: ‘ఇంట్లో ఏమీ లేనప్పుడు తాళం ఎందుకు వేశారు’.. ఓనర్‌కు దొంగల షాకింగ్ లేఖ

ఫ్రతీకాత్మక చిత్రం

దొంగలు వెళ్లిపోయిన తరువాత ఇంటికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్.. ఇంటి తలుపులు తీసి ఉండటం చూసి తన ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు.

  • Share this:
    భోపాల్‌: ఇంటిలో దొంగలపడి మన విలువైన వస్తువులు చోరీకి గురైతే ఎవరైనా బాధపడతారు. పోయిన తమ సొత్తు మళ్లీ దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతారు. ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సొమ్మును మరొకరు దోచుకెళ్లడం ఎవరికైనా బాధ కలిగించే విషయం. అయితే ఓ ఇంటికి కన్నం వేయడానికి సిద్ధపడ్డ దొంగలు.. అందులో ఏమీ దొరక్కపోతే చాలా నిరాశ చెందుతారనే విషయం మీకు తెలుసా ? దొంగలు అలా కూడా ఫీలవుతారా ? అని మీరు అనుకోవచ్చు. చాలామంది దొంగలు తమ శ్రమకు తగ్గ ఫలితం రాకపోతే బాధపడతారు కానీ బయటకు చెప్పరు. కానీ భోపాల్‌లోని ఓ ఇంట్లో పడ్డ దొంగలు మాత్రం ఈ రకమైన తమ బాధను ఏ మాత్రం దాచుకోలేదు. ఓ లేఖ రూపంలో తమ బాధను ఇంటి యజమానికి వ్యక్తం చేశారు.

    ఒక రకంగా చెప్పాలంటే.. ఇంట్లో తాము ఆశించిన స్థాయిలో ఏమీ లేకపోవడంతో ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న త్రిలోచన్ సింగ్ గౌడ్ అనే డిప్యూటీ కలెక్టర్ ఇంటిపై కొందరు దొంగలు కన్నేశారు. ఆయన ఇంట్లో లేని సమయం చూసి ఆమెలో చోరీకి పాల్పడ్డారు. డిప్యూటీ కలెక్టర్ ఇల్లు కదా.. అందులో ఎంతో డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఉంటాయని అనుకున్నారు.

    కానీ లోపల వాళ్లు ఊహించిన దానికి పూర్తి భిన్నంగా పరిస్థితి ఉంది. వాళ్లకు కేవలం రూ. 30 వేల విలువ చేసే వస్తువులు మాత్రమే లభించాయి. దీంతో ఆ దొంగలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. తమ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. వెంటనే ఓ లేఖ రాసి ఆ ఇంట్లోని టేబుల్ మీద పెట్టారు. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు అంటూ అందులో ఆ దొంగలు రాయడం గమనార్హం.

    Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

    Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

    దొంగలు వెళ్లిపోయిన తరువాత ఇంటికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్.. ఇంటి తలుపులు తీసి ఉండటం చూసి తన ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. అదే సమయంలో తన ఇంట్లో ఆ దొంగలు రాసి లేఖను చూశారు. ఈ విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డిప్యూటీ కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. అయితే దొంగలు రాసిన లేఖ గురించి తెలుసుకున్న చాలామంది నవ్వు ఆపుకోలేకపోయారు.
    Published by:Kishore Akkaladevi
    First published: