హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘దారిదోపిడి కుటుంబం’... చోరీలు చేస్తున్న తల్లీకొడుకు అరెస్ట్... ఎంత కాజేశారో తెలిస్తే...

‘దారిదోపిడి కుటుంబం’... చోరీలు చేస్తున్న తల్లీకొడుకు అరెస్ట్... ఎంత కాజేశారో తెలిస్తే...

నమూనా చిత్రం

నమూనా చిత్రం

తిరుపతిలో అనుమానస్పదంగా తిరుగుతున్న తల్లీకొడుకును అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు... విచారణలో షాకింగ్ విషయాలు...

  ఒకప్పుడు ఆ ఊరు ఊరంతా దొంగలే... దొంగల ఊరు... అనే మాటలు వినేవాళ్లం. కాలక్రమేణా అలాంటి ఊర్లు కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే కొన్ని కుటుంబాలు మాత్రం దొంగతనాలనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నాయి. అవును దారిదోపిడికి పాల్పడుతూ... కోట్లు కాజేసిన తల్లీకొడుకును కోయంబత్తూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా... షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా జిఆర్ నగర్ ఏరియాకు చెందిన రసూల్, ఆయన భార్య షమా, వారి కొడుకులు మహ్మద్ సలీమ్, చిన్నకొడుకు సమీర్... అంతా చోరకళనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. కొన్నాళ్లు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వీళ్లు... ఆ తర్వాత దారి దోపిడీలకు పాల్పడడం మొదలెట్టారు. కోయంబత్తూరులోని వివిధ ప్రాంతాల్లో దోపిడి చేసిన ఈ కుటుంబం... వాటిని అమ్మేందుకు తల్లీ, పెద్ద కొడుకు తిరుపతికి వచ్చారు. అయితే అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోని తీసుకుని ప్రశ్నించారు. వీరు చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందిన ఏపీ పోలీసులు... వారి దగ్గర ఉన్న నల్ల సంచులను తెరిచి చూడగా అందులో లక్షలు విలువైన బంగారం, వెండి, వజ్రాలు కనిపించాయి.


  దాదాపు 2 కిలోల బంగారం, 15 గ్రాముల వజ్రాభరణాలు, పావు కిలో వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... కోయంబత్తూర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ నమోదైన దోపిడి కేసుల ఆధారంగా వీరిని దొంగలను కన్ఫార్మ్ చేసుకుని, అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 60 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు పోలీసులు. ఇలా ఇప్పటికి ఈ దొంగ కుటుంబం కాజేసిన సంపద విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.  ఇవి కూడా చదవండి...


  ఆదివారం పనిచేయాలని బలవంతం... హోటెల్‌కు రూ.150 కోట్ల జరిమానా...


  సెల్ఫీ కావాలని దగ్గరకు వచ్చాడు... ఆ తర్వాత అసభ్యంగా తాకుతూ... కెనడా యువతికి...


  ఆ సంబంధాన్ని నిలదీశాడని... భర్త మీద కిరోసిన్ పోసి... నిప్పు పెట్టిన భార్య...


  16 ఏళ్ల బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్ కేసు... ఆ 8 మంది ఎక్కడ...  First published:

  Tags: Crime

  ఉత్తమ కథలు