రైలులో దొంగ.. విమానంలో పోలీసులు.. క్యా సీన్ హై..!

కింద రైలు.. పైన విమానం. రైలులో దొంగ.. విమానంలో పోలీసులు. మరి ఆ దొంగ దొరికాడా..? సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన వివరాలేంటి..?

news18
Updated: October 20, 2020, 3:33 PM IST
రైలులో  దొంగ..  విమానంలో పోలీసులు.. క్యా సీన్ హై..!
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 20, 2020, 3:33 PM IST
  • Share this:
రైలు పట్టాల వెంట రైలు పరుగులు తీస్తోంది. అందులో దొంగ పారిపోతుంటాడు. దొంగ ఆ రైళ్లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందుతుంది. పోలీసులు ఏం చేస్తారు..? రైల్వే పోలీసులకో.. లేదా ఆ రైలు తర్వాత ఆగబోయే స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఆ దొంగను పట్టుకునేలా చేస్తారు. కానీ అంత సమయం లేదు. దొంగ ఎక్కడ దిగుతాడో తెలియదు. మధ్యలో ట్రైన్ ఆగిపోయి.. దొంగ పారిపోతే..! ఇక అంతే సంగతి. కానీ పోలీసులు ఆ రైలు ను ఛేజ్ చేయడానికి విమానంలో వస్తే..! ఆ విమానం రైలు కంటే ముందుగానే చేరుకుని దొంగను పట్టుకోవడానికి సహాయపడితే..!! సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాలలో చూస్తుంటాం. తెలుగు సినిమాలలో అయితే ఈ సీన్లకు థియేటర్ లలో విజిల్స్, క్లాప్స్. కానీ ఇది నిజంగా జరిగిందండోయ్..!!

అవునూ.. ఈ ఘటన నిజంగా జరిగింది. పోలీసులు దొంగను పట్టుకోవడానికి విమానంలో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వివరాలివిగో.. పశ్చిమ బెంగాల్ కు చెందిన కైలాశ్ దాస్.. బెంగళూరు లో ఒక బిల్డర్ దగ్గర పనిచేస్తున్నాడు. గత వారం ఆయన కుటుంబసభ్యులకు కరోనా రావడంతో వారంతా ఆస్పత్రి పాలయ్యారు. ఇదే అదునుగా భావించిన కైలాశ్ దాస్.. ఆ బిల్డర్ ఇంట్లో ఉన్న కోటిన్నర రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగిలించాడు. బంగారంతో పాటు లాకర్ ను కూడా దొంగిలించాడని సమాచారం.

బంగారం దోచుకున్నదే తడువుగా అతడు అక్కడ్నుంచి పారిపోవాలనుకున్నాడు. ఇందుకు గాను యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలెక్కాడు. అదే అతడిని పట్టించింది. యశ్వంతపుర లో అతడు రైలెక్కెటపుడు.. ఆ దొంగ విజువల్స్ సీసీటీవీలో నమోదయ్యాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకోవడానికి ఏకంగా ఓ ఫ్లైట్ నే మాట్లాడుకున్నారు. దొంగకంటే ముందుగానే కోల్ కతా స్టేషన్ కు చేరుకుని కైలాష్ ను అరెస్టు చేశారు. అతడు కొట్టుకొచ్చిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading