• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • THIEF STOLEN MAN PHONE AND RETURN BACK IT WITHIN MINUTES AFTER KNOWING IT WAS NOT ONE PLUS 9 PRO MODEL HSN

షాకింగ్ ఘటన.. రోడ్డు పక్కన నిల్చుని చాటింగ్ చేస్తున్న వ్యక్తి ఫోన్ ను లాక్కెళ్లిపోయిన దొంగ.. క్షణాల్లోనే వెనక్కు తిరిగొచ్చి మరీ..

షాకింగ్ ఘటన.. రోడ్డు పక్కన నిల్చుని చాటింగ్ చేస్తున్న వ్యక్తి ఫోన్ ను లాక్కెళ్లిపోయిన దొంగ.. క్షణాల్లోనే వెనక్కు తిరిగొచ్చి మరీ..

ప్రతీకాత్మక చిత్రం

మెట్రో స్టేషన్ వద్ద నిలుచుని తన స్నేహితుడితో ఓ వ్యక్తి చాట్ చేస్తున్నాడు. ఇంతలోనే నల్లటి ముసుగు ధరించిన ఓ వ్యక్తి అతడి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతడి ఫోన్ ను లాక్కుని వెళ్లిపోయాడు. తిరిగి క్షణాల్లోనే వెనక్కు తిరిగొచ్చి..

  • Share this:
    చోరీ ఘటనలో పోయిన ఫోన్ తిరిగి దొరికితే, పోలీసులు తెచ్చి అప్పగిస్తే అదృష్టంగా ఫీలవుతాం. అదే ఫోన్ ను చోరీ చేసిన వ్యక్తే తిరిగి తెచ్చి ఇస్తే ఆశ్యర్యపోతాం. పైగా ఆ దొంగ ఫోన్ ను ఎందుకు తిరిగి ఇచ్చాడా? అని అనుమానం వ్యక్తం చేస్తాం కూడా. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి అచ్చం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి ఫోన్ చోరీకి గురయింది. రోడ్డు పక్కన నిలుచున్న అతడి ఫోన్ ను ముసుగు వేసుకున్న వ్యక్తి లాక్కెళ్లాడు. తిరిగి క్షణాల్లోనే ఆ దొంగ పరుగెత్తుకుంటూ వెనక్కు వచ్చాడు. ఆ ఫోన్ ను అతడి ముందు పడేసి ఓ మాట చెప్పి మరీ వెళ్లాడు. అది విన్న ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. ఆ విషయాన్ని తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకొచ్చాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు కథేంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

    ఢిల్లీకి డెబాయన్ రాయ్ అనే వ్యక్తి ఓ ప్రముఖ సంస్థలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. అతడు ఏప్రిల్ 5వ తారీఖున రాత్రిపూట ఉత్తరప్రదేశ్ లోని నోయిడా 59వ సెక్టార్ మెట్రో స్టేషన్ వద్ద నిలుచుని తన స్నేహితుడితో చాట్ చేస్తున్నాడు. ఇంతలోనే నల్లటి ముసుగు ధరించిన ఓ వ్యక్తి అతడి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. క్షణాల్లోనే అతడి ఫోన్ ను తన చేతుల్లోకి లాక్కున్నాడు. అతడు తేరుకునేలోపే పరుగెత్తుకుని వెళ్లిపోయాడు. దొంగ పట్టుకోండి.. పట్టుకోండి అని అరుస్తూ అయోమయంగా డెబాయన్ రాయ్ అక్కడే ఉండిపోయాడు.



    అయితే నిమిషాల వ్యవధిలోనే ఆ ముసుగు దొంగ వెనక్కు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ఫోన్ ను ఆ డెబాయన్ రాయ్ ముందు పడేశాడు. సారీ కూడా చెప్పి వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ ఓ షాకింగ్ విషయం చెప్పాడు ‘సారీ భాయ్. నాకు వన్ ప్లస్ 9 ప్రో మోడల్ కావాల్సి ఉంది’ అంటూ ఆ ఫోన్ ను అతడి ముందు పడేశాడు. అతడు చెప్పింది విని డెబాయన్ షాకయ్యాడు. ‘నా ఫోన్ గెలాక్సీ ఎస్ 10 మోడల్ కావడంతో బతికిపోయా. నా ఫోన్ నాకు చేరింది. ఫోన్ ను కింద పడేసినప్పుడు స్క్రీన్ మాత్రం కాస్త క్రాక్ అయింది. దాన్ని బాగు చేయించుకోవాలి‘ అంటూ డెబయాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published: