THIEF STEALS CASH AND GOLD ORNAMENTS IN GOA HOUSE LEAVES WITH I LOVE YOU MESSAGE SK
Crazy Thief: ఐ లవ్ యూ చెప్పి... ఇంట్లో ఉన్నదంతా ఎత్తుకెళ్లిన దొంగ.. నగలు, డబ్బుతో జంప్
ప్రతీకాత్మక చిత్రం
ఇంట్లో ఉన్న డబ్బులు, నగలను చోరీ చేసిన ఓ దొంగ.. వెళ్తూ..వెళ్తూ.. టీవీపై ఐ లవ్ యూ అని రాశాడు. రెండు రోజుల తర్వాత తిరిగొచ్చిన ఓనర్ టీవీపై ఆ సందేశం చూసి షాక్ అయ్యాడు.
ఒక్కో దొంగ మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరు కేవలం డబ్బులే ఎత్తుకెళ్తే.... మరికొందరు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇంకొందరు మహానుభావులుంటారు.. ఆడవారి లో దుస్తులనే ఎత్తుకెళ్తారు. ఇలాంటి చిత్ర విచిత్రాలు టీవీ, పేపర్లో చాలాసార్లు చూశాం. ఇక దొంగతనం చేసే సమయంలో కొందరు దొంగలు వెరైటీ పనులు చేస్తుంటారు. వచ్చిన పనిని మర్చిపోయి.. కడుపు నిండా తిని పడుకునే వారు కూడా ఉన్నారు. అంతేకాదు.. దొంగతనం చేసిన ఇంట్లోనే కునుకు తీసే జాతిరత్నాలూ ఎందరో ఉన్నారు. తాజాగా గోవా (Goa)లో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ.. డబ్బులు, నగలు దోచేసి.. ఆ తర్వాత టీవీపై 'ఐ లవ్ వ్యూ' అని రాసిపారిపోయాడు. దక్షిణ గోవాలోని మార్గోవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆసిబ్ జెక్ అనే వ్యక్తి ఇటివలే తన కుటుం సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి ఫంక్షన్‌కు వెళ్లాడు. రెండు రోజులపాటు అక్కడే ఉన్నారు. ఫంక్షన్ తర్వాత ఇంటికి తిరిచ్చారు. తాళం తీసి లోపలికి వెళ్లి చూసి.. ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. వారికి అనుమానం వచ్చింది. వెంటనే అల్మారాను పరిశీలించారు. అందులో బంగారం, వెండి నగలతో పాటు నగదు కనిపించలేదు. ఇంట్లో దొంగతనం జరిగిందని వారికి అర్థమయింది. మొత్తం 20 లక్షల విలువైన బంగారం, వెండి నగలతో పాటు రూ.1.5 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఉన్నదంతా దొంగలు చోరీ చేయడంతో ఆసిబ్ జెక్ ఫ్యామిలీ లబోదిబోమంది.
వేసిన డోర్లు వేసినట్లే ఉన్నాయి. తాళం కూడా అలాగే ఉంది. మరి దొంగలు లోపలికి ఎలా వచ్చారో అర్ధం కాలేదు. ఇళ్లంతా తిరిగి చూశారు. బూత్రూమ్ కిటికీ పగులగొట్టి ఉండడంతో.. దొంగలు అంటు నుంచి లోపలికి వచ్చి ఉంటారని అనుమానిస్తారు. ఐతే చోరీలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు.. వెళ్తూ..వెళ్తూ.. టీవీపై 'ఐ లవ్ వ్యూ' అని రాశారు. ఆ మెసేజ్‌ను చూసి ఆసిబ్ జెక్ షాకయ్యాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి వెళ్లి గదులన్నింటినీ పరిశీలించారు. చోరీ జరిగినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆ ఇంటి చుట్టు పక్కల పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగను పట్టుకుంటామని చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.