Home /News /crime /

వీడి దుంపుతెగ.. మూడు నెలల్లో బరువు తగ్గి అనుకున్నది సాధించాడు.. ఏం చేశాడో తెలిస్తే షాక్

వీడి దుంపుతెగ.. మూడు నెలల్లో బరువు తగ్గి అనుకున్నది సాధించాడు.. ఏం చేశాడో తెలిస్తే షాక్

నిందితుడు

నిందితుడు

మోతీ రోజుకి ఒక్కసారే తింటూ బరువు తగ్గడానికి ప్రయత్నించాడు. అలా వరుసగా మూడు నెలల పాటు ఈ డైట్ పాటించడంతో చాలా బరువు తగ్గాడు.

  దొంగతనాలకు అలవాటయ్యే వాళ్లు తమ ఫిట్‌నెస్‌ మీద పెద్దగా దృష్టి పెట్టారు. చాలామంది దొంగలు విలాసాలకు అలవాటు పడి తన ఫిజిక్‌ను, బరువు గురించి పట్టించుకోరు. కానీ ఇక్కడ మనం తెలుసుకోబోయే ఓ దొంగ మాత్రం అలా కాదు. చాలాకాలం నుంచి ఓ భారీ దొంగతనం చేయడం కోసం ప్లాన్ చేసిన అతగాడు.. ఇందుకోసం ఏకంగా 10 కిలోలకు పైగా బరువు (Weight) తగ్గాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని(gujarat)  అహ్మదాబాద్‌కు చెందిన మోతీ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి బరువు తగ్గాలని భావించారు. ఓ భారీ దొంగతనం చేసేందుకు అతడు శరీర బరువు తగ్గించుకున్నాడు. 34 ఏళ్ల మోతీ సింగ్ భోపాల్‌లోని బసంత్ బహార్ సొసైటీలోని మోహిత్ మరాడియా ఇంట్లో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో ఇంట్లోని విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయో పక్కా సమాచారం సేకరించాడు. ఇంటి లోపల, బయట ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు (CCTV) ఉన్నాయో కూడా తెలుసుకున్నాడు.

  ఇంట్లో సంప్రదాయ పద్ధతిలో పగలకుండా ఎలక్ట్రానిక్ తలుపులు ఉండేవి. మోతీ కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించాలని అనుకున్నాడు. అందుకని కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించేందుకు తదనుగుణంగా సన్నబడాల్సి వచ్చింది. మోతీ రోజుకి ఒక్కసారే తింటూ బరువు తగ్గడానికి ప్రయత్నించాడు. అలా వరుసగా మూడు నెలల పాటు ఈ డైట్ పాటించడంతో చాలా బరువు తగ్గాడు. మోతీ లావు కాకూడదని ఏదో ఒక కారణంతో డిన్నర్‌కు దూరంగా ఉండేవాడని మోతీ ప్రస్తుత యజమాని పోలీసులకు తెలిపాడు. దోపిడీ జరిగిన ఇంట్లో, చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాల నుండి మోతీ తప్పించుకోగలిగాడు. దీంతో అతడిని కనిపెట్టడం పోలీసులకు కష్టమైంది.

  అతన్ని కనుగొని పట్టుకోవడంలో పోలీసులు చాలా కష్టపడ్డారు. చివరిరు ఇంట్లోకి చొరబడేందుకు కిచెన్ కిటికీ కట్టర్ మరియు రేజర్ బ్లేడ్ కొనడానికి వెళ్లిన హార్డ్‌వేర్ స్టోర్‌లోని సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు అతనికి కనిపెట్టారు. నవంబర్ 5వ తేదీన దొంగతనం జరిగింది. మోహిత్ మరాడి ఇంట్లో ఆ వ్యక్తి రూ.37 లక్షలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు సమయంలో మోతీ నుండి దొంగిలించబడిన ఇతర విలువైన వస్తువులను కూడా పోలీసులు కనుగొన్నారు. మోతీ సెల్‌ఫోన్ లొకేషన్‌పై దృష్టి సారించిన పోలీసులు మోతీ ఆచూకీ గురించి సమాచారం అందుకున్నారు.

  Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

  K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

  ఎట్టకేలకు తన స్వగ్రామమైన ఉదయ్‌పూర్‌కు పారిపోయేందుకు మోతీ యత్నిస్తుండగా ఎస్పీ రింగ్‌రోడ్డుపై పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద చోరీకి గురైన డబ్బు, విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసిన తరువాత విచారణలో దొంగతనానికి పాల్పడే కట్టుదిట్టమైన డైట్ రహస్యాన్ని మోతీ బయటపెట్టాడు. కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. ఆ కిటికీ గుండా వెళ్లేందుకు మోతీ బరువు తగ్గాల్సి వచ్చింది. అందుకు మోతీ నిజాయితీతో బరువు తగ్గే ప్రయత్నాన్ని సాగించింది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Crime news

  తదుపరి వార్తలు