వృద్ధాప్య పింఛన్ల సొమ్ము చోరీ... రంగంలోకి వెయ్యి మంది... గంటల్లోనే దొరికిన దొంగ..

దాదాపు వెయ్యిమంది ప్రజలు దొంగను పట్టుకోవటానికి రంగంలోకి దిగారు. దొంగని పట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

news18-telugu
Updated: November 1, 2019, 5:02 PM IST
వృద్ధాప్య పింఛన్ల సొమ్ము చోరీ... రంగంలోకి వెయ్యి మంది... గంటల్లోనే దొరికిన దొంగ..
దొంగను కట్టేసిన స్థానికులు, డబ్బుల బ్యాగ్
  • Share this:
మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బుల బ్యాగును దోచుకెళ్లిన దొంగకు ప్రజలు చుక్కలు చూపించారు. దొంగతనం జరిగిన కొన్ని గంటలకే అతన్ని పట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన రామలక్ష్మమ్మ అనే పంచాయతీ కార్యదర్శి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేందుకు రూ.16 లక్షల నగదును బ్యాంకు నుంచి డ్రా చేసింది. వాటిని బ్యాగులో ఉంచి ఆటోలో తీసుకెళుతుండగా కుళ్లాయప్ప అనే దొంగ ఆమెను బెదిరించి డబ్బుల బ్యాగును లాక్కెళ్లిపోయాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేశారు. అక్కడి గ్రామాల పెద్దలకు సమాచారం ఇవ్వటంతో పాటు గాలింపు చేపట్టారు.

దాదాపు వెయ్యిమంది ప్రజలు దొంగను పట్టుకోవటానికి రంగంలోకి దిగారు. దొంగని పట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడి వద్దనుంచి డబ్బును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు.కాగా ఈసొమ్ము రెండు గ్రామాలకు వృధ్యాప్య ఫించన్ పంపిణి చేయాల్సిన డబ్బులుగా గుర్తించారు.First published: November 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...