Home /News /crime /

THIEF FALLS ASLEEPS WHILE ROBBERY WOKEN UP BY POLICE IN CHILAKALURIPET IN ANDHRA MKS

Chilakaluripet : దొంగతనానికి వచ్చి దర్జాగా కునుకేశాడు.. పోలీసులు నిద్రలేపేసరికి షాక్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘వీడెవడండీ బాబూ..’అని ఆశ్చర్యపోయేలా.. చోరీకి వచ్చిన ఓ దొంగ ఇంట్లో మంచం మీద దర్జాగా పడుకుని నిద్రపోయాడు. తీరా పోలీసులు వచ్చి నిద్రలేపేసరికి తెల్లమొఖం వేశాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పాముకంటే పదునైన వినికిడి శక్తితో పిల్లి అడుగులను సైతం పసిగట్టడం, అరక్షణంలోనే అప్రమత్తం కావడం దొంగల సలహజ లక్షణం. కానీ ‘వీడెవడండీ బాబూ..’అని ఆశ్చర్యపోయేలా.. చోరీకి వచ్చిన ఓ దొంగ ఇంట్లో మంచం మీద దర్జాగా పడుకుని నిద్రపోయాడు. తీరా పోలీసులు వచ్చి నిద్రలేపేసరికి తెల్లమొఖం వేశాడు. ప్రస్తుత గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిలకలూరిపేట పోలీసులు చెప్పిన వివరాలివి..

చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం ఐటీసీ గోదాము ఎదురుగా ఉన్న ఓ ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి కొంతకాలం కిందట అమెరికా వెళ్లారు. తాళాలు వేసున్న ఇళ్లపై దొంగలు స్పెషల్ ఫోకస్ పెడతారని తెలిసిందే. మొన్న శుక్రవారం రాత్రి ఆ ఇంట్లోకి ఓ దొంగోడు ప్రవేశించాడు. ఇంటి వెనుక నుంచి తలుపులు పగలగొట్టి లోపలికి దూరిన దొంగ.. ముందు జాగ్రత్తగా ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను తొలగించాడు. ఆ తర్వాత..

Karimnagar : కరీంనగర్‌లో కారు బీభత్సం.. రోడ్డుపక్కన కూలీలను తొక్కేసుకుంటూ.. నలుగురు దుర్మరణం..



ఇంట్లో ఉన్న కప్ బోర్డులు, బీరువాలు అన్నీ వెతికినా దొంగకు విలువైన వస్తువులేవీ దొరకలేదు. ఆ చిరాకులో అసహనానికి గురై, అసహనంకాస్తా అలసటగా మారి దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే మంచంపై పడుకున్న దొంగ ఆదమరిచి నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత ఆ ఇంట్లో తలుపులు తీసి ఉండటాన్ని గుర్తించిన చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.

Soundarya Suicide : మాజీ సీఎం మనవరాలు.. చిటికెస్తే సకల సౌకర్యాలు.. అయినా, సౌందర్య ఎందుకలా చేసింది?


హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. దొంగదారితోనే లోపలికి వెళ్లి చూడగా, లోపల మంచంపై దొంగోడు దర్జాగా నిద్రపోతూ కనిపించాడు. అతణ్ని లేపి బేడీలతో గుడ్ మార్నింగ్ చెప్పారు పోలీసులు. పట్టుపడిన దొంగ విజయవాడకు చెందినవాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తామని చిలకలూరిపేట పోలీసులు తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: AP Police, Guntur, Thief Arrested

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు