భారీ చోరీ... పక్కా ప్లాన్ వేసి కొల్లగొట్టిన దొంగలు

Andhra Pradesh : ఆ కుటుంబ సభ్యురాలు ఎప్పుడూ ఇంటిని వదిలిపోలేదు. ఆమె ఇంట్లో ఎప్పుడూ ఎవరూ ఒకరు తెలిసిన వాళ్లు ఉంటూనే ఉంటారు. కానీ దొంగల కన్ను మాత్రం ఆ ఇంటిపైనే ఉండేది. చివరకు ప్లాన్ వేసి చోరీ చేశారు.

news18-telugu
Updated: September 13, 2019, 11:58 AM IST
భారీ చోరీ... పక్కా ప్లాన్ వేసి కొల్లగొట్టిన దొంగలు
చోరీ అయిన ఇల్లు
  • Share this:
తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనేది కోట్ల మంది భక్తుల కోరిక. తూర్పుగోదావరి జిల్లా... ప్రత్తిపాడు నియోజకవర్గం... శంకవరం మండలం... అన్నవరం గ్రామంలోని... రెవెన్యూ ఆఫీస్ వీధిలో ఉంటున్న దాసరి రామలక్ష్మికి కూడా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని మొక్కుకుంది. అన్నీ సెట్ చేసుకొని సెప్టెంబర్‌ 7న తీర్థయాత్రలకు బయలుదేరి... తిరుమల వెళ్లింది. శ్రీవారి దర్శనం బాగానే జరిగింది. చక్కగా లడ్డూ ప్రసాదం తీసుకొని... గురువారం తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి గడియ వేసి ఉంది కానీ... తాళం వేసి లేదు. షాకైన ఆమె... ఇదేంటి నేను తాళం వేసే వెళ్లానే... తాళం చెవి కూడా నా బ్యాగులోనే ఉంటుందే... అనుకొని... వెంటనే బ్యాగులో చెక్ చేసుకుంది. అందులో ఆమెకు తాళం చెవి కనిపించింది. మరి తాళం ఏమైంది అనుకున్న ఆమె... కంగారుగా గడియ తీసి చూసింది. లోపలికి వెళ్తే... మొత్తం చిందరవందరగా ఉంది. ఇల్లంతా గుల్ల చేసినట్లు అయిపోయింది. బట్టలూ, వస్తువులూ... ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయి. దొంగతనం జరిగినట్లు ఆమెకు అర్థమైంది. షాకైంది.

గబగబా వెళ్లి... అల్మరా తెరిస్తే... అది మొత్తం ఖాళీగా ఉంది. దాంతో... అందులో దాచుకున్న నాలుగు తులాల బంగారు హారం, నాలుగు తులాల జత గాజులు, ఒక తులం చెవిదిద్దులు, 1250 గ్రాముల రెండు వెండి కంచాలు, అరకేజీ వెండి చెంబుతో పాటు కేజీ దేవుడి సామగ్రి, రూ.1000 క్యాష్ మొత్తం పట్టుకుపోయారని అర్థమైంది. లబోదిబోమంటూ ఆమె అన్నవరం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కాకినాడకు చెందిన క్లూస్ టీమ్ అక్కడకు వచ్చి మొత్తం చెక్ చేసింది. కేసు నమోదు చేసి... దర్యాప్తు మొదలుపెట్టింది. ఆ ఏరియా గురించి బాగా తెలిసిన దొంగలే ఈ పని చేసి ఉంటారని భావిస్తోంది.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు