హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG:ఓర్ని.. నీ ఆనందం పాడుగాను.. చోరీకి వచ్చి డ్యాన్స్ తో రచ్చ చేసిన దొంగ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

OMG:ఓర్ని.. నీ ఆనందం పాడుగాను.. చోరీకి వచ్చి డ్యాన్స్ తో రచ్చ చేసిన దొంగ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

డ్యాన్స్ చేస్తున్న దొంగ..

డ్యాన్స్ చేస్తున్న దొంగ..

Uttar Pradesh: చోరీలు చేయడం కూడా ఒక ఆర్ట్. ఒక వ్యక్తి స్థానికంగా ఉన్న హర్డ్ వేర్ షాపులో దొంగతనం చేశాడు. ఇక వచ్చిన పని పూర్తయిన ఆనందంలో అక్కడ డ్యాన్స్ తో రచ్చ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Thief Dances After Robbing Hardware Shop In Uttar Pradesh: యూపీలోని అందౌలీలో ఒక విచిత్ర చోరీ ఘటన జరిగింది. ఒక వ్యక్తి స్థానికంగా ఉన్న హర్డ్ వేర్ షాపులో దొంగతనం చేశాడు. ఆ తర్వాత.. పని పూర్తయిన ఆనందంలో అక్కడే మాస్ స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రతి రోజు వందల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటాయి. నెటిజన్లు వీటిని చూడటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. తాజగా, చోరీకి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. సాధారణంగా దొంగ తనం చేయడం కూడా ఒక ఆర్ట్. ఇది అరవై నాలుగు కళల్లో ఒకటి . చాలా మంది దొంగతనాలకు ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరు మాత్రమే దానిలో సక్సెస్ అవుతారు. కొందరు దోంగతనం చేస్తు అడ్డంగా దొరికి పోతారు. కొందరు ఉద్యోగం రాలేదనో.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తుంటారు. మరికొందరు తాము చేస్తున్న ఉద్యోగంలో వచ్చే రాబడి చాలక చోరీలు చేస్తుంటారు. వీరిలో కొందరు బంగారు షాపులు, బట్టల షాపులలో చోరీలు చేస్తుంటారు. మరికొందరు ఇళ్లను, దుకాణాలలో సైతం టార్గెట్ చేసి మరీ చోరీలు చేస్తారు.


ఇక్కడ ఒక వ్యక్తి అందౌలీలో ఉన్న హర్డ్ వేర్ దుకాణంలో చోరీకి వచ్చాడు. అతను ముఖానికి స్కార్ప్ కట్టుకున్నాడు.  ఈ క్రమంలో.. షెట్టర్  తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించి కౌంటర్ లో ఉన్న నగదు, ఇతర కాస్లీ సామానులను చోరీ చేశాడు. మరీ వచ్చిన పని తొందరగా పూర్తయిందనుకున్నాడో.. లేకపోతే.. ఎవరు పట్టుకోలేదనుకున్నాడో కానీ ఒక సారిగా ఆనందం తట్టుకోలేకపోయాడు. వెంటనే డ్యాన్స్ చేస్తు రచ్చ చేశాడు. మాస్ స్టెప్పులు వేస్తు.. ఇక వచ్చినపని అయ్యిందిరా బాబు అనుకుంటూ సంతోషంలో మునిగిపోయాడు. ఆ తర్వాత వచ్చిన దారిలో తిరిగి వెళ్లిపోయాడు.

ఇక తెల్లవారగానే.. షాపు యజమాని వచ్చి షాపు చూడగానే షాకింగ్ కు గురయ్యాడు. లోపలికి వెళ్లి చూడగానే వస్తువులు, కౌంటర్ లోని డబ్బులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి . వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమారాను పరిశీలించారు. అప్పుడు వారి అక్కడ రికార్డు అయిన ద్రుశ్యాలు చూసి షాక్ కు గురయ్యారు. దొంగ..ఆనందంతో చేతులు ఊపుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాడు. పోలీసులు కూడా దొంగ ప్రవర్తన చూసి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Robbery, Uttar pradesh, Viral Videos

ఉత్తమ కథలు