Home /News /crime /

THIEF ARRESTED ON CCTV FOOTAGE OF PASSENGER CELLPHONE THEFT AT KODERMA RAILWAY STATION IN JHARKHAND SNR

Video Viral:రైల్వేస్టేషన్‌లో నిద్రపోతున్న ప్రయాణికుల పక్కన పడుకొని వాడేం చేశాడో చూడండి..

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Jharkhand:రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్న ప్రయాణికుడి సెల్‌ఫోన్ మాయం చేశాడో దొంగ. తోటి ప్రయాణికుడిలా వాళ్ల మధ్యలో పడుకొని..ప్రయాణికులు నిద్రలోకి జారుకోగానే సెల్‌ఫోన్‌ తీసుకొని పారిపోయాడు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డవడంతో నిందితుడ్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు.

ఇంకా చదవండి ...
రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, ఆటోల దగ్గర ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నారో దొంగలు కాచుకొని కూర్చుంటారు. మనం ఆదమరిచేలోపే అన్ని కాజేసి మాయమైపోతారు. అజాగ్రత్తగా ఉన్నా..నిద్రపోతున్నా సరిగ్గా అప్పుడే వాళ్ల టాలెంట్ అంతా చూపించి మన జేబులు కాళీ చేస్తారు. విలువైన వస్తువులను ఎత్తుకుపోతారు. జార్ఖండ్‌ (Jharkhand)లో అదే జరిగింది. కోడెర్మా( Koderma)రైల్వే స్టేషన్‌ (Railway station)లో ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫారమ్ దగ్గరున్న( UTS) కౌంటర్ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. బ్యాగులు తల దగ్గర పెట్టుకొని నిద్రలోకి జారుకోవడం ఓ దొంగ గమనించి ప్రయాణికుల్ని దోచుకునేందుకు తాను కూడా ప్రయాణికుడిలా నటిస్తూ వారి పక్కన పడుకున్నాడు. కాస్త సమయం గడవగానే ప్రయాణికుల దగ్గరున్న బ్యాగులు రాకపోవడంతో విలువైన సెల్‌ఫోన్‌ జేబులో కనిపించింది. అంతే వెంటనే ఆ స్మార్ట్ ఫోన్‌ని కాజేశాడు. ఈ రైల్వే దొంగ దొంగతనం చేస్తున్న దృశ్యాలన్ని ప్లాట్‌ఫామ్‌ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరా(CCTV footage)లో రికార్డయ్యాయి. సెల్‌ఫోన్ (cell phone)చోరి చేసి పారిపోయాడు దొంగ. హిమ్మత్ సింగ్ షెకావత్ (Himmatsingh Shekhawat)అనే ప్రయాణికుడి ఫోన్ పోవడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్టైన రైల్వే పోలీసులు దొంగను గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ప్రయాణికులు పడుకున్న చోట సీసీ ఫుటేజ్ పరిశీలించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నవాళ్లను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కోడెర్మా పోస్ట్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జ్ జవహర్ లాల్ కానిస్టేబుళ్లకు సమాచారం అందించారు. గంటల వ్యవధిలోనే ఫోన్ దొంగిలించిన వికాస్ కుమార్‌ని కోడెర్మా రైల్వే స్టేషన్‌కు దక్షిణం చివర ఉన్న పిఆర్‌ఎస్ కౌంటర్ దగ్గర పట్టుకున్నారు. దొంగ బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన వాడిగా రాబట్టారు.

విలువైన వస్తువులపై ఓ కన్నేయండి..
మొబైల్ చోరీ చేసిన వికాస్‌ కుమార్‌ దగ్గర నుంచి మొబైల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ప్రయాణికుడు హిమ్మత్ సింగ్ షెకావత్ అందజేశారు. ఈకేసును గంటల వ్యవధిలో చేధించేందుకు సహాయపడిన ఇన్స్‌పెక్టర్ జవహర్ లాల్, లేడీ కానిస్టేబుల్ ప్రీతి కుమారి, కానిస్టేబుల్ ధీరజ్ కుమార్‌ను అభినందించారు రైల్వే అధికారులు. ప్రయాణికుడు హిమ్మత్ సింగ్ షెకావత్ దగ్గర చోరీ చేసిన మొబైల్‌ ఫోన్‌ 20వేల రూపాయలు చేస్తుందని రైల్వే పోలీసులు తెలిపారు.

(రైల్వేస్టేషన్‌లో సెల్‌ఫోన్ చోరీ దృశ్యాలు)

దొంగలుంటారు జాగ్రత్త..
దొంగిలించిన వికాస్ కుమార్ సింగ్‌ను అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని..దొంగలు ఉంటారని పదే పదే ప్రచారం చేస్తున్నా, అవగాహన కల్పిస్తున్నా..ఏమరపాటుగా ఉండవద్దని , విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని కోరుతున్నారు. చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ని రైల్వే అధికారుల సోషల్ మీడియా గ్రూప్‌లో షేర్ చేశారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Jarkhand, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు