హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘నన్నుచంపుతామంటూ ముస్లిం పెద్దల నుంచి కాల్స్..’.. ఆందోళనలో వినాయక విగ్రహాం ప్రతిష్టించిన ముస్లిం మహిళ..

‘నన్నుచంపుతామంటూ ముస్లిం పెద్దల నుంచి కాల్స్..’.. ఆందోళనలో వినాయక విగ్రహాం ప్రతిష్టించిన ముస్లిం మహిళ..

రూబీ ఖాన్ (ఫైల్)

రూబీ ఖాన్ (ఫైల్)

Uttar pradesh:  ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళ హిందూవుల దేవుడైన గణేషుడిని తన ఇంట్లో ప్రతిష్టించింది. దీనిపై ఆమెకు ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  మీరట్ కు చెందిన రూబీ ఖాన్ మరోసారి వార్తలలో నిలిచింది. ఆమె ఇప్పటికే తన ఇంట్లో గణేషుడిని ప్రతిష్టించి, 7 రోజుల పాటు పూజలు చేస్తున్న వార్త నెట్టింట చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా.. ఆమెను.. కొందరు... ముస్లింపెద్దలు చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మరోసారి వార్తలలో నిలిచింది. ఆమె హిందువుల ఇష్ట దేవుడైన గణేషుడిని ప్రతిష్టించింది. దీనికి ఆమె కుటుంబ సభ్యులు కూడా సహాకరించారు. దీంతో స్థానిక ముస్లిం నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

ఆమెను వెంటనే పూజలు మానేయాలని ఇప్పటికే పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని రూబీ ఖాన్ తెలిపారు. పూజలు మానుకొకపోతే.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఆమె గతంలో కూడా అయోధ్యలో రామాలయంకు శంకుస్థాపన తర్వాత.. తన ఇంట్లో పూజలు చేశారు. ఆ సమయంలో కూడా ఆమెకు వ్యతిరేకండా పలువురు ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీచేశారు. అంతే కాకుండా.. తన ఫోటోలను మజ్జీత్ లో కాల్చేశారని తెలిపింది. ఎవరు వ్యతిరేకించిన గణేషుడిని నిమజ్జనం చేసి తీరతానని రూబీఖాన్ చెప్పుకొచ్చింది. ఈ ఘటన యూపీ లో తీవ్ర కలకలంగా మారింది.

ఇదిలా ఉండగా గణేష్ వేడుకలో షాకింగ్ ఘటన జరిగింది.

యూపీలోని (UttarPradesh)లోని మెయిన్‌పురి(Mainpuri) సమీపంలోని కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో వినాయక చవితి వేడుకల్లో(Ganesh Utsav)  భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ భజన బృందానికి చెందిన రవి శర్మ అనే కళాకారుడు హనుమంతుడి వేషంలో అందరినీ ఆకట్టుకున్నాడు. హనుమంతుడి వేషదారణలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉన్న రవి శర్మ(35) అనే వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. అయితే ఇదంతా భజన, డ్యాన్స్‌లో భాగమేమోనని అందరూ అనుకున్నారు.

అయితే రవి శర్మ చాలా సేపటి వరకు పైకి లేవకపోవడంతో గమనించిన గణేష్ మండపం నిర్వాహకులు అతడిని వెంటనే మెయిన్‌పురి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటన ఆ గణేష్‌ మండపంలో విషాదాన్ని నింపింది. అప్పటివరకు ఎంతో హుషారుగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేసిన వ్యక్తి మండపంలోనే ప్రాణాలు కోల్పోవడం వల్ల భక్తులు షాక్​కు గురయ్యారు. కాగా,ఆంజనేయస్వామి వేషధారణలో రవి శర్మ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌(Viral Video) అవుతోంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Ganesh Chaturthi​, Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు