Lovers Serious Decision: కులాలు వేరుకావడమే వారు చేసిన తప్పా.. కుల గజ్జి ఎంత పని చేసిందో చూడండి..

ఆత్మహత్య చేసుకున్నయువకుడు, యువతి (ఫైల్)

Lovers Serious Decision: గత రెండేళ్లుగా ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి కలకాలం కలిసి బతకాలని ఆశపడ్డారు. వారి యొక్క కులాలు వేరుకావడం.. వారి తల్లిదండ్రులు, పెద్దలు వారి పెళ్లికి నిరాకరించడంతో అర్ధాతరంగా వారిద్దరు చనిపోయారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 ఏళ్ల నాగమణి సుందరయ్యనగర్‌ లో నివాసం ఉంటుంది. పక్కనే ఉన్న దుబ్బాక తండాకు చెందిన 28 ఏళ్ల ధరావత్ నహ్రూ ప్రేమించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా వీళ్ల వ్యవహారం నడుస్తోంది. అతడు అక్కడే స్థానికంగా మేస్త్రీగా పని చేస్తున్నాడు. నాగమణి మాత్రం ఇటీవల నర్సింగ్ విద్య పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరారు. ఈ నేపథ్యంలో ధైర్యం చేసి ఓ రోజు ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల ముందు ఉంచారు. నాగమణి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి నిరాకరించారు. అంతేకాకుండా ఆమెకు మరో యువకుడితో వివాహం చేయడానికి నిర్ణయించారు. విషయం తెలుసుకున్న ధరవత్‌ నెహ్రూ ఎంతో బాధపడ్డాడు. తనలో తాను మదనపడ్డాడు. తెలిసిన రోజే దుబ్బతండాలోని తన నివాసంలో ఉరేసుకొని చనిపోయాడు.

  ప్రేమించాడు.. ఆమెతో ఎన్నో కలలు కన్నాడు.. ప్రేమను ప్రపోజ్ చేసేసరికి ఆమె చెప్పిన సమాధానం ఎంటో తెలుసా.


  అతడు చనిపోయిన విషయం తెలుసుకున్న నాగమణి హైదరాబాద్ లో రైలు కింద పడి అదేరోజు రాత్రి ప్రాణాలు తీసుకుంది. హఫీజ్‌పేట్‌-చందానగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలుకింద పడి ఆమె చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు సందరయ్యనగర్ కు తీసుకొచ్చారు. చేతికి అందివచ్చిన కుమార్తె మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఫోన్‌కాల్స్‌ ఆధారంగా నాగమణి మృతిపై దర్యాప్తు జరుపుతున్నట్లు నాంపల్లి రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఇలా ఇద్దరి ప్రేమ.. మరణాలకు దారి తీయడంతో వారి గ్రామంలో, కటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

  కన్న కూతురుపై అత్యాచారం చేయబోయాడు.. కానీ ఆమె ఇలా చేస్తుందని ఊహించలేకపోయాడు.. ఏం చేసిందంటే..


  ఇదిలా ఉండగా.. మరో ఘటనలో కరోనా కాలంలోనే అతడు పదో తరగతి పూర్తి చేశాడు. మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇటర్ మీడియట్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఈ ప్రేమ విషయం చెప్పాడు. కానీ ఆమె ఇచ్చిన సమాధానానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం సంతులాల్‌పోడు తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సంతులాల్‌పోడు తండా చెందిన 19 ఏళ్ల యువకుడు గంధంపల్లి–కొత్తపేటకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఆమెను ఎంతో ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నానని తన ప్రేయసి కి లవ్ ప్రపోజ్ చేశాడు.

  దీంతో ఆమె వరసుకు చెల్లి వరుస అవుతాను.. తనను ప్రేమించవద్దు.. ఆ ఆలోచన మార్చుకొమ్మని సదరు యువతి చెబుతుంది. దీంతో అతడు తీవ్రంగా మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చెందాడు. మృతుడి తండ్రి భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్‌ తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  Women Sarpanch: ఆ గ్రామంలో అతడు చేసిన పనికి.. మహిళా సర్పంచ్ ఎంత పని చేసిందో తెలుసా..


  దీనిపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా ప్రేమించి ప్రాణాలు తీసుకుంటున్న ఈ ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రేమించకుంటే చంపేస్తా.. యాసిడ్ పోస్తా అంటూ ఎన్నో హత్యలు అప్పట్లో చోటు చేసుకునేవి.. తాజాగా ఇలా క్షణికావేశంలో విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలా తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగుల్చుతున్నారు. దయచేసి క్షణికావేశంలో ప్రాణాలనే తీసుకోవద్దని పోలీసులు కూడా పేర్కొంటున్నారు.
  Published by:Veera Babu
  First published: