Home /News /crime /

THEY LET US STRIPPED AND MADE TO HAVE INTERCOURSE ALLEGED BY TWO PERSONS FROM JHARKHAND POLICE CONDEMN IT NK

మమ్మల్ని సెక్స్ చేసుకోమన్నారు. ఏడుగురు పోలీసులపై ఇద్దరు వ్యక్తుల ఆరోపణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇదో విచిత్రమైన కంప్లైంట్. నమ్మేలా లేదు. కానీ ఇదే నిజమైతే మాత్రం ఇంతకంటే దారుణం ఉండదు. అసలు ఆ వ్యక్తులు ఏమని ఆరోపించారు.. పోలీసులు ఏమంటున్నారు.. చూద్దాం.

    "పోలీస్ స్టేషన్‌లో పోలీసులు మా బట్టలు ఊడదీసి మమ్మలని నగ్నంగా నిలబెట్టారు. ఇద్దర్నీ సెక్స్ (Sexual intercourse) చేసుకోమన్నారు" అని జార్ఖండ్... జంషెడ్‌పూర్‌లో ఇద్దరు వ్యక్తులు ఆరోపించడం (Allegations) తీవ్ర కలకలం రేపుతోంది. "మేము తిరస్కరించాం. దాంతో వాళ్లు మమ్మల్ని చితకబాదారు. ఆఫ్ఘనిస్థాన్ పంపిస్తామని బెదిరించారు" అని వారు ఆగస్ట్ 27న కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులపై ఆగస్ట్ 24న కిడ్నాపింగ్ కేసు నమోదైంది. ఆగస్టు 26న తమను ప్రశ్నిస్తూ (interrogate) పోలీసులు ఇలా చేశారని వారు ఆరోపించారు.

    ఈ కేసులో బాధితులుగా భావిస్తున్న వారు మహ్మద్ అర్జూ, మహ్మద ఔరంగజేబు. వీరు జంషెడ్‌పూర్ (Jamshedpur) SSPకి కంప్లైంట్ ఇచ్చారు. తమను కద్మా పోలీస్ స్టేషన్‌ (kadma PS)లో ఏడుగురు పోలీసులు టార్చర్ (torture) చేశారని ఆరోపించారు. ఆ ఏడుగురు పోలీసుల్లో స్టేషన్ ఇన్‌ఛార్జి అయిన మనోజ్ కుమార్ ఠాకూర్ కూడా ఉన్నారని తెలిపారు.

    మెడికల్ రిపోర్ట్:
    ఆ ఇద్దరు బాధితుల మెడికల్ రిపోర్టు ఆగస్ట్ 27న తెల్లవారు జాము 2 గంటలకు MGM హాస్పిటల్ విడుదల చేసింది. వారికి మందులు ఇవ్వాలని ఆ రిపోర్టులో ఉంది. ఔరంగజేబుకి బ్రెయిన్‌కి సీటీ స్కాన్ (CT scan) చెయ్యాలని రిపోర్టులో ప్రతిపాదన ఉంది. ఇలా ఎందుకు ఉంది అనే దానిపై ఔరంగజేబు SSP తమిళవనం మాట దాటవేశారు.

    తనపై వచ్చిన ఆరోపణలను మనోజ్ కుమార్ ఠాకూర్ ఖండించారు (condemn). మేం వాళ్లను కిడ్నాపింగ్ కేసులో ప్రశ్నించాం. ఆ తర్వాత వాళ్లను వెళ్లమన్నాం. కానీ వాళ్లు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు అని మనోజ్ కుమార్ అన్నారు. కొల్హాన్ రేంజ్ DIG అస్సేం విక్రాంత్ మింజ్, జంషెడ్‌పూర్ డీసీ సురాజ్ కుమార్... దీనిపై ఇంకా స్పందించలేదు.

    ఆగస్ట్ 24న తనను పోలీసులు పట్టుకున్నట్లు మహ్మద్ అర్జూ తెలిపాడు. "నన్ను మొదటి రోజు కొట్టారన్న విషయం తెలిసి ఔరంగజేబు పారిపోయాడు. పోలీసులు అతని తండ్రిని తీసుకొచ్చి ప్రశ్నించారు (enquire). ఆ తర్వాత ఔరంగజేబు పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. మమ్మల్ని ఆగస్టు 26న టార్చర్ చేశారు" అని అర్జూ తెలిపాడు.

    ఇది కూడా చదవండి: వధువు కావలెను.. అని షాప్‌ ముందు బోర్డ్ పెట్టాడు.. అనూహ్య పరిణామంతో షాక్!

    ఆగస్ట్ 26 సాయంత్రం నాడు తమను వెళ్లిపోయేందుకు అనుమతి ఇచ్చారని ఔరంగజేబు తెలిపాడు. మరి ఈ కేసులో ఆరోపణలు నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. నిజమే అయితే... పోలీస్ వ్యవస్థకే అది సిగ్గుచేటు అవుతుందనుకోవచ్చు. పోలీసులపై ఇలాంటి ఆరోపణలను ఉత్తినే ఎవరూ చెయ్యరనీ... ఏదో జరిగే ఉంటుందని కొంత మంది బాధితులకు మద్దతుగా నిలుస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Crime news, Crime story, Jharkhand, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు