ఇప్పటి వరకు మనం చాలా రకాల దొంగలు (Thief) గురించి వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం.. సాధారణంగా దొంగలు విలువైన వస్తువులు, లేద నగలు లేదా డబ్బును ఎత్తుకెళ్తూ ఉంటారు. దొంగల టార్గెట్ ఈ మూడు మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకు ఎక్కడ దొంగతనాలు జరిగినా వీటి చుట్టూ అవి ఉంటాయి. కొంతమంది ఇళ్లకు కన్నాలు వేస్తారు.. మరికొందరు బ్యాంకులు, ఏటీఎంలుల్లో చోరీలకు పాల్పడతారు. మరికొందరు బస్సులు, ట్రైన్లు.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. మరికొందరైతే ఒంటరిగా వెళ్లేవారిని బెదిరించి దొంగతనాలు చేస్తూ ఉంటారు.. ఇలా వివిధ రకాల దొంగల గురించి నిత్యం వింటూనే ఉంటాం.. అయితే ఈ దొంగ మాత్రం వారికి పూర్తి భిన్నం.. అతడే ఓ వెరైటీ దొంగ (different Thief).
ఖరీదైన బైక్లు ఉన్నా వద్దంటాడు.. హోండా యాక్టివా (Honda Activa) మాత్రమే టార్గెట్ అంటాడు ఆ దొంగ (different Thief).. ఎందుకిలా అంటే, అతడు చెప్పే కారణం వింతగా ఉంది మరి. ‘నా ఎత్తు 5 అడుగులు, బక్కగా ఉంటా. పెద్ద బైక్లను దొంగతనం చేసి, అవి నడపరాక ఎందుకు అవస్థలు. నా ఎత్తుకు (Height), నా బరువు (Weight)కు హోండా యాక్టివాలే కరెక్ట్’ అని సమాధానమిస్తాడు. అలా దాదాపు 9 హోండా యాక్టివాలు, ఓ టీవీఎస్ స్కూటీని దొంగతనం (Theft) చేశాడు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కుసరాజు అలియాస్ నందగోపాల్ (Nanda Gopal). ఇతడిని మంగళవారం మియాపూర్ పోలీసులు (Miyapur Police) అరెస్టు చేశారు. సూపర్ మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లోని పార్కింగ్ స్థలాల్లో యాక్టివాలకు తాళం పెట్టి మర్చిపోతే, ఆ వాహనాలను దొంగిలిస్తానని చెప్పాడు.
ఘట్కేసర్ పరిధిలో..
మరోవైపు ఘట్కేసర్ (Ghatkesar) పోలీసు స్టేషన్ పరిధిలో బైకుల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతేడాది (2021) సెప్టెంబరు నుంచి నవంబర్ (2021) మధ్య కాలంలో మొత్తం మూడు మోటార్ సైకిళ్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి ఘట్కేసర్ పోలీసు స్టేషన్ (రాచకొండ) లో మూడు కేసులు నమోదయ్యాయి.
ముఠాపై ప్రత్యేక దృష్టి..
టూ వీలర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై ప్రత్యేక దృష్టి సారించిన రాచకొండ పోలీసులు.. యమ్నంపేట్ X రోడ్ సమీపంలో అనుమానాస్పద పరిస్థితులలో కనిపించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులు నిందితులుగా ఉన్న ఏ1 చిందం రాజు S/o నర్సింహ Jnnrm కాలనీ, బోగారం గ్రామంలో ఉంటూ పెయింటర్ గా కూడా పనిచేస్తున్నాడు. ఇతని స్వస్థలం యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం మండలం ప్యారారం గ్రామం. మరో నిందితుడు ఏ2 చిందం మహేష్ S/o మైసయ్య. ఇతన నాగోల్ లోని మమతానగర్ లో నివాసముంటున్నారు. ఇతని స్వస్థలం యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని పిల్లయ్యపల్లె గ్రామం.
ఈ ఇద్దరు నిందితుల నుంచి మొత్తం 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. బోగారం గ్రామంలోని జేఎన్యూఆర్ఎం కాలనీలో ఉన్న ఎ-1 చింతంరాజు నివాసం నుండి 5 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నాగోల్ లోని మమత నగర్ కాలనీలో ఉన్న ఎ-2 చింతం మహేష్ నివాసం నుండి నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... ఆ తర్వాత నిందితులు ఏ1, ఏ2లను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. నిందితులు నివాసముంటున్న ప్రాంతంలోని బస్టాండ్లు, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ సెంటర్లు వంటి రద్దీగా ఉండే కేంద్రాల వద్ద పార్క్ చేసిన మోటారు సైకిళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.