Home /News /crime /

THESE SHOCKING INCIDENT NEAR RANIPET HAS CAUSED GREAT TRAGEDY IN THE AREA SSR

Sad: నాలుగు నెలల క్రితమే ఈ ఇంట్లో పెద్ద కొడుకు పెళ్లి జరిగింది.. కానీ ఇంతలోనే ఇలా..

భార్య, కొడుకుతో రామలింగం (ఫైల్ ఫొటో)

భార్య, కొడుకుతో రామలింగం (ఫైల్ ఫొటో)

తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా కావేరిపక్కం సుబ్బన్న ముదలియర్ వీధిలో రామలింగం అనే 66 ఏళ్ల వయసున్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ భార్యాకొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

    రాణిపేట: తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా కావేరిపక్కం సుబ్బన్న ముదలియర్ వీధిలో రామలింగం అనే 66 ఏళ్ల వయసున్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ భార్యాకొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చోళినగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న రామలింగం(66) అనే గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగి, లెక్చరర్ తన భార్య అనురాధ(49), ఇద్దరు కొడుకులు విఘ్నేష్(30), భరత్(29)తో కలిసి ఉంటున్నారు. ఆయన పెద్ద కొడుకు విఘ్నేష్‌కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. విఘ్నేష్ ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డాడు.

    భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. రామలింగం బ్యాంకులో పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నట్లు తెలిసింది. అప్పులు తీర్చేందుకు కొంత డబ్బును, కొడుకు పెళ్లికి మరికొంత డబ్బును ఖర్చు చేశాడు. ఇలా తీసుకున్న లోన్ డబ్బు మొత్తం ఖర్చయిపోయింది. తిరిగి చెల్లించేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో.. కొన్ని రోజులుగా రామలింగం, అతని భార్య, చిన్నకొడుకు భరత్ ఆ లోన్ తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు అధికారులు పోలీసులను వెంటబెట్టుకుని ఇంటికొస్తారేమోనని రామలింగం చాలా భయపడ్డాడు. మరికొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా కుటుంబాన్ని వెంటాడాయి. బయట తాను చెల్లించాల్సిన అప్పులు ఉండటం, బ్యాంకుకు లోన్ చెల్లించకపోతే పరువు పోయే పరిస్థితి ఉండటంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఈ కుటుంబం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

    ఎంత పొద్దెక్కినా ఇంటి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని చూసేసరికి లోపల లాక్ చేసి ఉంది. తలుపులు బద్ధలు కొట్టి చూడగా ముగ్గురూ ఉరేసుకుని విగత జీవులుగా కనిపించారు. పోలీసులు ఈ ఘటన గురించి రామలింగం పెద్ద కొడుకు విఘ్నేష్‌కు సమాచారం అందించారు. అతను వస్తే ఈ కుటుంబం ఆత్మహత్యకు గల కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. భార్యాభర్త, వాళ్ల కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. రామలింగం మంచి వ్యక్తేనని.. కుటుంబాన్ని బాగానే చూసుకునేవాడని.. అలాంటి వ్యక్తి కుటుంబంతో సహా ఎందుకిలా ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం కావడం లేదని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్యతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Family suicide, Suicide hanging, Tamilnadu

    తదుపరి వార్తలు