చెన్నై: ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు అర్జున్. కేరళకు చెందిన 23 ఏళ్ల వయసున్న ఈ యువకుడు చెన్నైలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే రూం తీసుకుని ఉంటున్నాడు. రూంమేట్స్ కూడా ఎవరూ లేరు. ఒక్కడే ఉండేవాడు. జనవరి 3న రాత్రి అర్జున్ తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని రూంలో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్‌లో ‘అందరూ ఉన్నా ఒంటరినైపోయాను. అందువల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా చివరి కోరిక ఒకటి ఉంది. నేను చనిపోయాక నా మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయకుండా నా తల్లిదండ్రులకు అప్పగించండి’ అని అందులో రాసి ఉంది.
పోలీసులు ఆ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఓ విషయం తేలింది. అర్జున్ ఓ యువతిని ప్రేమించాడు. అర్జున్ చనిపోయిన రోజు రాత్రి కూడా ఆ యువతి అతని రూంకు వచ్చి వెళ్లింది. ఆమె వెళ్లిపోయాక అర్జున్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆమెతో గొడవ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక క్యాన్సర్ భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అర్జున్ నోటిపై ఓ పుండు కనిపించింది. నోటి క్యాన్సర్ వచ్చిన వారికి ఉండే పుండులా అది కనిపించడంతో పోలీసులు క్యాన్సర్ భయంతో ఏమైనా అర్జున్ ఆత్మహత్య చేసుకున్నాడేమోనని అనుమానిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Suicide