Home /News /crime /

THERE HAS BEEN AN UPROAR OVER THE CCTV VIDEO OF THE INCIDENT WATCH THE VIDEO HERE SSR

Shocking Video: ఓ ఛాయ్ సెంటర్ దగ్గర సాయంత్రం అందరూ టీ తాగుతున్నారు.. ఉన్నట్టుండి ఊహించని ఘటన

వీడియోలోని దృశ్యం

వీడియోలోని దృశ్యం

గుజరాత్‌లో ఓ యువకుడు హత్యకు గురైన తీరు అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన గురించి తెలిసిన వారికి వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. ఈ హత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    వపి: గుజరాత్‌లో ఓ యువకుడు హత్యకు గురైన తీరు అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన గురించి తెలిసిన వారికి వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. ఈ హత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా వపి పట్టణంలో దారుణమైన హత్య జరిగింది. ఒక మహిళ గురించి రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ చివరికి 32 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది.

    సల్మాన్ అనే యువకుడు వపి పట్టణంలో ఓ ఏరియాలో టీ షాప్ దగ్గర నిల్చుని ఉన్నాడు. టీ షాపు వ్యక్తి టీ పెడుతున్నాడు. ఇంతలో అక్కడికి పసుపు రంగు చొక్కా వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి వచ్చీ రావడంతోనే సల్మాన్‌ను ఎగిరి తన్నాడు. కిందపడిన సల్మాన్‌ను వెంట తెచ్చుకున్న గొడ్డలితో విచక్షణారహితంగా నరికాడు. వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారంతా ఎటు వాళ్లు అటు పారిపోయారు. టీ షాపులో కుర్రాడు కూడా లోపలికి పరిగెత్తాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పలుమార్లు గొడ్డలితో నరకడంతో తీవ్ర రక్తస్రావమై.. గాయాల పాలైన ఆ యువకుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.



    హత్యకు గురైన సల్మాన్‌కు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. హత్యకు గురైన సల్మాన్ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ హత్య మొత్తం టీ షాపులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. గత శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఓ మహిళ విషయంలో నిందితుడికి, బాధితుడి కుటుంబానికి మధ్య గొడవ జరిగిందని.. ఆ పాత పగల వల్లే ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.

    ఇది కూడా చదవండి: Lady Doctor: ఎంత చక్కగా ఉన్నావ్ సిస్టర్.. పైగా డాక్టర్‌వి.. కానీ నువ్వు చేసిన పని మాత్రం..

    పోలీసులు హత్య చేసిన నేరస్తుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడి గురించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని.. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వపి ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాయంత్రం ఆ టీ దుకాణం దగ్గర ఎంతోమంది టీ తాగేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరగడం చర్చకు దారితీసింది. అంతమంది ఉన్నప్పటికీ నిందితుడు ఏమాత్రం జంకకుండా వెంట తెచ్చుకున్న గొడ్డలితో విచక్షణారహితంగా నరకడం అక్కడున్న వారిని షాక్‌కు గురిచేసింది. ఎదుటి వ్యక్తిపై పెంచుకుంటున్న కోపతాపాలు చివరకు ఇలాంటి కిరాతకాలకు పాల్పడేలా చేస్తున్నాయి. చంపితే పగ తీరుతుందని భావిస్తున్న నేరస్తులు.. హత్య చేస్తే ఏదో ఒక రోజు దొరికిపోక తప్పదని.. జైలు శిక్ష పడుతుందని తెలిసినా ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Brutally murder, Crime news, Tea, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు