సెక్స్ వర్కర్లుగా పురుష పుంగవులు.. వ్యభిచారానికి బానిసై..

మహిళలే కాదు పురుషులు కూడా పెద్ద మొత్తంలో సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. అదెక్కడో కాదు.. ఇండియాలోనే. అదీ.. దేవ భూమి కేరళలో. ఆ రాష్ట్రంలో దాదాపు 13,331 మంది పురుషులు సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారట. కేరళ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన సర్వేలో ఈ నిజం బయటపడింది.

news18-telugu
Updated: October 31, 2019, 8:43 PM IST
సెక్స్ వర్కర్లుగా పురుష పుంగవులు.. వ్యభిచారానికి బానిసై..
మహిళలే కాదు పురుషులు కూడా పెద్ద మొత్తంలో సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. అదెక్కడో కాదు.. ఇండియాలోనే. అదీ.. దేవ భూమి కేరళలో. ఆ రాష్ట్రంలో దాదాపు 13,331 మంది పురుషులు సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారట. కేరళ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన సర్వేలో ఈ నిజం బయటపడింది.
  • Share this:
మహిళలే కాదు పురుషులు కూడా పెద్ద మొత్తంలో సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. అదెక్కడో కాదు.. ఇండియాలోనే. అదీ.. దేవ భూమి కేరళలో. ఆ రాష్ట్రంలో దాదాపు 13,331 మంది పురుషులు సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారట. కేరళ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన సర్వేలో ఈ నిజం బయటపడింది. ప్రస్తుతం అక్కడ 17వేల మంది మహిళలు వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్నారు. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ఆ రాష్ట్రానికి వలస వెళ్లే సెక్స్ వర్కర్ల సంఖ్య ఏటేటా ఊహించని విధంగా పెరుగుతోంది. ముఖ్యంగా పల్లెటూర్ల నుంచి సిటీలకు వచ్చిన వారు ఈ బాట పడుతున్నట్లు తేలింది. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా వీళ్లు అసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వే తెలిపింది. పురుష సెక్స్ వర్కర్లలో 36-46 వయస్సు వారే ఎక్కువగా ఉన్నారని, కేరళలోని పలు నగరాల్లో ఉన్న హోటళ్లు, ఫ్లాట్లలో ఉంటూ వ్యభిచారం చేస్తున్నారని సర్వే వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ వృత్తిలో కొనసాగి, వయసు మీద పడ్డ వారు ఏజెంట్లుగా మారుతున్నారని తెలిపింది.

మరోవైపు బెంగాల్, బిహార్, ఒడిసా నుంచి వచ్చిన మహిళా సెక్స్ వర్కర్లు.. వారి చుట్టాలను, స్నేహితులను కూడా తీసుకొస్తున్నారట. ముఖ్యంగా.. ఏంజెట్ల ద్వారా బెంగాల్ నుంచి వేలల్లో సెక్స్ వర్కర్లు సరిహద్దు దాటి కేరళకు వస్తున్నారని సర్వే తెలిపింది. మగ సెక్స్ వర్కర్లు ఎక్కువగా కేరళలోని కోజికోడ్ జిల్లా నుంచి వస్తున్నారు. వీరిలో 10వేల మందికి పైగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని, వారిలో 11 పురుషులకు, నలుగురు మహిళలకు హెచ్‌ఐవీ కూడా ఉందని సర్వే స్పష్టం చేసింది. కాగా.. కేరళలో 2008లో 0.13 శాతంగా ఉన్న ఎయిడ్స్, 2018 నాటికి 0.05 శాతానికి తగ్గింది.
First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading