Home /News /crime /

THEFT IN MANY TEMPLES THIEVES WHO SET ASIDE HUNDIS AND STOLE IDOLS IN SIDDIPETA AND SANGAREDDY DISTRICTS VB MDK

Robbery: పలు ఆలయాల్లో చోరీ.. హుండీలను పక్కన పెట్టేసి వాటిని ఎత్తుకెళ్లారు.. ఎక్కడంటే..

విగ్రహాలను దోచుకెళ్లిన దొంగలు

విగ్రహాలను దోచుకెళ్లిన దొంగలు

Robbery: డబ్బుల కోసం ఎంతటి పనికైన దిగుతున్నారు కేటుగాళ్లు. ఎక్కడైనా ఆలయంలో చోరీ జరిగిందంటే సాధారణంగా హుండీని పగలకొట్టి అందులో ఉన్న డబ్బులను దోచుకెళ్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా ఈ దొంగలు హుండీలను పక్కన పెట్టేసి విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    (కె. వీరన్న, మెదక్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

    డబ్బుల కోసం ఎంతటి పనికైన దిగుతున్నారు కేటుగాళ్లు. ఎక్కడైనా ఆలయంలో చోరీ జరిగిందంటే సాధారణంగా హుండీని పగలకొట్టి అందులో ఉన్న డబ్బులను దోచుకెళ్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా ఈ దొంగలు హుండీలను పక్కన పెట్టేసి విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గుట్టపై ఉన్న పురాతన శంభో లింగేశ్వర ఆలయంలో.. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణ పరిధిలో జైన దేవాలయాలలో ఈ చోరీలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా మండలం దౌల్తాబాద్లోని గుట్టపై లింగేశ్వరుని తో పాటు మూడు దశాబ్దాల క్రితం ప్రతిష్ఠించిన సూర్య భగవానుడు, నాగదేవత, పార్వతి దేవి రాతి విగ్రహాలు ఉన్నాయి. ఉదయం పూజారి పూజ చేయడం కోసం ఆలయంలోకి వెళ్లగా దేవుళ్ళ విగ్రహాలు కనిపించలేదు. ఈ విషయం ఆలయ కమిటీ చైర్మన్ వేణుగోపాల్ తెలియజేయగా అక్కడికి వచ్చి పరిశీలించారు. నిజంగానే ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆలయ కమిటీ చైర్మన్ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. భక్తులు ఆ దుండగులకు పట్టుకొని కఠినంగా శిక్షించాలని దౌల్తాబాద్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. చోరీ చేసిన వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

    సంగారెడ్డి జిల్లా జోగిపేట మండల కేంద్రలో కొలువైన జైన దేవాలయంలో వెనుక వైపు ఉన్న ప్రవేశం ద్వారం గొళ్లెంను పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి.. ఆలయంలో ఉన్న జైన తీర్థంకరులు 22 పంచలోహాలు, 6 శిలా విగ్రహాలతో పాటు 7 విగ్రహ సింహాలు మరో 3 ఉపకరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు ప్రధాన ద్వారపు తాళం తీసి చూసేసరికి వెనుక వైపు తలుపులు తీసి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా జైన తీర్థంకరులు విగ్రహాలు కనిపించలేదు. దీంతో జోగిపేట్ ఎస్ఐ వెంకటేష్ ను ఆలయ కమిటీ సభ్యుడు కిషన్ ప్రసాద్ ఆలయాన్ని సందర్శించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సంగారెడ్డి నుంచి క్లూస్ టీం రప్పించారు.

    దొంగలను పట్టుకోడానికి పోలీసులు క్లూస్ టీంను రప్పించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే అక్కడ కొన్ని గుర్తులను మాత్రం క్లూస్ టీం సేకరించింది. బూట్ల చెప్పులు, ఫింగర్ప్రింట్ తదితర గుర్తులను సేకరించారు . ఆలయ కమిటీ సభ్యుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు డబ్బుల హుండీని ఎత్తుకెళ్తారు కానీ.. విగ్రహాలను ఎత్తుకెళ్లడమనేది తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పోలీసులు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Medak, Robbery, Sangareddy, Siddipeta

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు